సినిమా

Bhagyashri Borse: "లెనిన్" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Bhagya Shree Borse: లెనిన్ హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలీడ్ హిట్ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమాతో ఇద్దరికీ దక్కింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ, తెలుగు కంటే ముందు మలయాళం సినిమాలో ముఖ్య పాత్రను దక్కించుకుంది. ఇందులో, మోహన్ లాల్ హీరోగా నటిస్తుండటం విశేషం.

Bhagyashri Borse: లెనిన్ హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలీడ్ హిట్ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమాతో ఇద్దరికీ దక్కింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ, తెలుగు కంటే ముందు మలయాళం సినిమాలో ముఖ్య పాత్రను దక్కించుకుంది. ఇందులో, మోహన్ లాల్ హీరోగా నటిస్తుండటం విశేషం.

మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ఎంట్రీ:

మాస్ మహారాజ్ రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంతా, కింగ్డం, ఆంధ్రాకింగ్ తాలూకా లాంటి సినిమాలు చేసింది. కానీ, ఇవేవీ భాగ్యశ్రీని క్రేజీ హీరోయిన్‌గా మార్చలేకపోయాయి..మరో సాలీడ్ సినిమాలో ఛాన్స్‌ని తెచ్చిపెట్టలేకపోయాయి.

అఖిల్, భాగ్యశ్రీ జంటగా నటించిన లెనిన్ మూవీ అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక పాటలో అయితే, భాగ్యశ్రీ నాభి అందాల మీదే దర్శకుడు ఫోకస్ చేశాడు. సినిమాలో పర్ఫార్మెన్స్‌తో పాటు గ్లామర్‌తోనూ భాగ్యశ్రీ బాగా ఆకట్టుకుంది. దీంతో, చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న మంచి హిట్ ఇప్పుడు దక్కింది. ఈ హిట్ కోసమే భాగ్యశ్రీ ఎంతో తాపత్రయపడింది. ఒక్క లెనిన్ సక్సెస్‌తో ఈ బక్కపలచని బ్యూటీకి సౌత్ భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

వాస్తవానికి తెలుగులో శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న జార్జి రెడ్డి సినిమాలో ఎంపికైందని లెనిన్ హిట్ తర్వాత వార్తలు వచ్చాయి. కానీ, ఇరుముడి సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రియ భవానీ శంకర్ వైపు ఇప్పుడు జార్జి రెడ్డి మేకర్స్ మొగ్గు చూపుతున్నారట. ఇదిలా, ఉంటే..మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీ జాయిన్ కాబోతోంది.

దర్శకుడు విష్ణు మోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఆపరేషన్ గంగ' మూవీని రూపొందిస్తున్నాడు. ఓ యదార్థ సంఘటన ఆధారంగా మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ధురందర్ ఫేమ్ సస్వత్ సింగ్ సచ్ దేవ్ సంగీత దర్శకుడు. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ గోకులం సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీకి అవకాశం రావడం..అది కూడా మాలీవుడ్ ఎంట్రీ సినిమా కావడం విశేషమని చెప్పాలి.

#Mohan Lal#Bhagyashri Borse#Operation Ganga#Vishnu Mohan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి