క్రైమ్

Crime : రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!

రచన: Kumar3 నిమిషాల పఠనం

మానవ రూపంలో ఉన్న కొన్ని మృగాలు రోడ్ల మీద సంచరిస్తున్న, ఒంటరిగా ఉండే మహిళలు, మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుంటాయి. ఎవరూలేని సమయంలో వారి మీద అఘాయిత్యాలకు పాల్పడంతో పాటు ఎక్కడ పోలీసులకు దొరికిపోతామనే భయంతో అమాయకులను బలిగొంటున్నారు.

మానవ రూపంలో ఉన్న కొన్ని మృగాలు రోడ్ల మీద సంచరిస్తున్న, ఒంటరిగా ఉండే మహిళలు, మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుంటాయి. ఎవరూలేని సమయంలో వారి మీద అఘాయిత్యాలకు పాల్పడంతో పాటు ఎక్కడ పోలీసులకు దొరికిపోతామనే భయంతో అమాయకులను బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. చట్టాలు బలహీనంగా ఉండటమే మహిళలపై నేరాలు పెరగడానికి కారణమనే వాదనలూ వినిపిస్తున్నాయి.

తమిళనాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ కామాంధుడి కన్ను పడింది. చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించిన మనిషి రూపంలో ఉన్న మృగం.. ఒక్కసారిగా ఆ మహిళపై తన కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించింది. బాధితురాలు వదిలిపెట్టాలని వేడుకున్నా వినిపించుకోలేదు.తనను రక్షించాలని గట్టిగా కేకలు వేసినా ఎవరూ రాలేదు. అయితే, అక్కడే సంచరిస్తున్న ఓ శునకం మాత్రం ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. చుట్టుపక్కల ఎవరూ లేరన్న ధైర్యంతో మహిళపై బలవంతంగా అఘాయిత్యానికి తెగబడిన ఓ కామాంధుడిని కరించేందుకు శునకం ప్రయత్నించింది. ఆ కామాంధుడు తంతున్నా వెనక్కి తగ్గకుండా ఎక్కడబడితే కరించింది.

https://x.com/pulsenewsbreak/status/2095924846236754394?s=20

బాధితురాలు గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటింస్తుండటం, శునకం వెంటబడి మరీ కరుస్తుండటంతో చివరికి ఆ కామాంధుడు అక్కడి నుంచి పరిపోయేందుకు ప్రయత్నించాడు.అయినా వెంటబడిన శునకం అతన్ని పరిగెత్తించింది.ఈ ఘటనకకు సంబంధించిన విజువల్స్ స్థానికంగా ఉన్న ఓ సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#rapist#women#dog#saved#crime#tamilnadu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి