సినిమా

'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

'Kalki 2898 AD Part 2': పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో కల్కీ పార్ట్ 2 కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలై కొన్నాళ్ళు చిత్రీకరణ జరిగిన తర్వాత మళ్ళీ నిలిచిపోయింది. అయితే, తాజా సమాచారం మేరకు త్వరలో, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. అంతేకాదు, కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను మేకర్స్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

దీపిక స్థానంలో ఆలియా:

కల్కి 1 లో దీపిక పడుకొణె ముఖ్య పాత్రలో కనిపించింది. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశ పఠానీ నటించారు. కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ, రాంగోపాల్ వర్మ లాంటి వారు గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ విజన్ అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. హై టెక్నికల్ వ్యాల్యూస్ తో కల్కి పార్ట్ 1 రూపొందగా, ఇప్పుడు పార్ట్ 2ని అంతకుమించిన స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

అయితే, పార్ట్ 1లో దీపిక చేసిన పాత్ర కంటిన్యుటీలో ఇప్పుడు ఆలియా భట్ వచ్చి చేరబోతున్నట్టుగా అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో వినిపిస్తోంది. స్పిరిట్ సినిమా విషయంలో వచ్చిన డిఫరెన్సెస్ వల్ల, కల్కి నుంచి కూడా తొలగించారు. ఆ పాత్రలో ఎవరు నటిస్తారూ? అనే సందేహాలు ఇన్నాళ్ళు ఉన్నాయి. దీనికి, త్వరలో మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ రాబోతుందని సమాచారం. దాదాపుగా, ఆలియానే నాగ్ అశ్విన్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

"ఆర్ఆర్ఆర్"తో టాలీవుడ్‌లో గుర్తింపు:

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్‌టిర్ హీరోలుగా వచ్చిన "ఆర్ఆర్ఆర్" మూవీతో ఆలియా భట్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె పాత్ర చిన్నదే అయినా, మంచి పేరొచ్చింది. దాంతో, ఆ తర్వాత చాలా సినిమాలలో అనుకున్నప్ప్టటికీ ఎందుకనో ఫైనల్ కాలేదు. ఇప్పుడు మాత్రం కల్కీ పార్ట్ 2 అలాగే, ఎన్‌టిర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా డ్రాగన్ లో ఆలియాకి ఛాన్స్ వచ్చిందట. త్వరలోనే, ఈ రెండు సినిమాల మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ రావచ్చు. ఇదే, నిజమైతే ఆలియాకి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా స్థానం లభించవచ్చు.

#alia bhatt#deepika padukone#kalki 2#prabhas#amitahb bachan#nag ashwin
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి