తెలంగాణ

TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ‘ఎస్ఐఆర్’ పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. శనివారం కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ‘ఎస్ఐఆర్’ పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. శనివారం కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌‌కు గుర్తింపు వచ్చిందన్నారు.

ఇక్కడి ప్రజల అభిమానమే తన బలమని ముఖ్యమంత్రి వెల్లడించారు. మోడీ సర్కార్ SIR పేరుతో నాటకాలు ఆడుతోందని, కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర, బిహార్, బెంగాల్ ఎన్నికల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసి గెలిచారన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసిందని విమర్శించారు.

గతంలో ప్రతిపక్షాలను అణచివేయడానికి ఈడీ, సీబీఐలను ఉపయోగించారని, ఇప్పుడు నేరుగా ఓట్లను తొలగించి తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి పేదల ఓట్లు డిలీట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీని ఓడించే కుట్రలో కేంద్రంలోని బీజేపీకి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని సీఎం రేవంత్ ఆరోపించారు.రాష్ట్రంలో ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ప్రజల ఓట్లను రక్షించాల్సిన బాధ్యత నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరిపై ఉందని సీఎం సూచించారు. గ్రామాల వారీగా బీఎల్ఏ‌లను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి బూత్‌లో ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

#Congress#cm revanth reddy#SIR#kodangal#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి