తెలంగాణ

BRS : పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు

రచన: Kumar4 నిమిషాల పఠనం

పాలిటెక్నిక్ విద్యార్థులు మరోసారి కదం తొక్కారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 97ను రద్దు చేయాలని, ‘శక్తి’ స్కీంలో భాగంగా తమను ‘స్కిల్ వర్సిటీ’లో చేర్చొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ నిరసనలను ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.

పాలిటెక్నిక్ విద్యార్థులు మరోసారి కదం తొక్కారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 97ను రద్దు చేయాలని, ‘శక్తి’ స్కీంలో భాగంగా తమను ‘స్కిల్ వర్సిటీ’లో చేర్చొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ నిరసనలను ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. గత నెల రోజులకు పైగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 వలన తమ చదువులు ఎందుకు పనికి రాకుండా పోతాయని, తాము ఉద్యోగులుగా కంటే లేబర్‌‌గా మారిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తమ డిమాండ్లను పరిష్కరించాలని పాలిటెక్నిక్ విద్యార్థినులు శనివారం సికింద్రాబాద్ పరిధిలోని సంగీత్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ పాలిటెక్నిక్ విద్యార్థినులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వాహనాల్లో తరలించారు. విద్యార్థులను పోలీసు వాహనాల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విద్యార్థినులను అరెస్టు చేసిన విషయం తెలియడంతో మాజీ మంత్రి హరీశ్ రావు ఓ పబ్లిక్ మీటింగులో విద్యార్థినులకు మద్దతుగా మాట్లాడారు. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద కేసులు పెడుతున్న పోలీసులను హెచ్చరించారు. ‘మీ పోలీసులకు కూడా డీఏలు, సరెండర్ లీవులు, పీఆర్సీలు రావడం లేదు.. మీకు కూడా రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. మా పిల్లలను ఒక్క దెబ్బ కొట్టినా హరీష్ రావు అడ్డంగా ఉంటాడు.. ఖబర్దార్..!.కేసు పెట్టాల్సి వస్తే మీరు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీద. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా పిల్లల చదువు ఆగం చేసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని బాండ్ పేపర్లు పంపి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.

కేటీఆర్ భరోసా..

ఇదిలాఉండగా, కంటోన్మెంట్ సంగీత్ జంక్షన్ వద్ద నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థినులకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు.అసెంబ్లీలో చర్చకు ఒత్తిడి పెట్టి.. జీవో 97 రద్దు కోసం పాలిటెక్నిక్ యువత పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఉన్న కేటీఆర్.. ఫోన్ ద్వారా హైదరాబాద్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థినులతో మాట్లాడి భరోసా కల్పించారు.

https://x.com/pulsenewsbreak/status/2096116686701383907?s=20

https://x.com/TeluguScribe/status/2096108785836417239?s=20

#Harish rao#KTR#brs#polytechnic students#congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి