Megastar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలను కొన్ని రోజుల గ్యాప్‌లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతున్న విశ్వంభర మూవీని యూవీ వారు డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలాగే, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇది, అఫీషియల్ కన్‌ఫర్మ్.
దసరా నుంచి తప్పుకున్న విశ్వంభర?
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విశ్వంభర చిత్రానికి ఇంకా వీఎఫెక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో దసరా కి కూడా వచ్చేలా కనిపించడం లేదు. అయితే, డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు యూవీ క్రియేషన్ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఇక్కడ కూడా ఓ చిక్కుంది. ఫైనల్ అవుట్‌పుట్ మెగాస్టార్ ఒకే అంటేనే. లేదంటే, మళ్ళీ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఇక వచ్చే ఏడాదే.
బాబీ-చిరు కాంబోలో కాకా:
ఇటీవల దర్శకుడు బాబీ, చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కాకా చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ డేట్ తో కన్‌ఫర్మ్ చేశారు. 2027, సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఠఫ్ కాంపిటీషన్ ఉండేలా ఉంది. ఇప్పటికే, నాలుగు చిత్రాలు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. ఏ సినిమా ఎంతవరకూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందో చూడాలి.
డిసెంబర్ లో విశ్వంభర వస్తే గట్టి పోటీనే..
ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా గనక పూర్తైతే డిసెంబర్ లో డేట్ ఫిక్స్ చేసుకోవాలి. కానీ, ఈ డిసెంబర్ కి నాగార్జున కింగ్ 100, బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా కూడా ఇదే డిసెంబర్ లో ఉంది. కాబట్టి, విశ్వంభర కి డిసెంబర్ నెల అంతగా కలిసి రావడం కష్టమే. చూడాలి, మరి మెగాస్టార్ డెసిషన్ ఎలా ఉంటుందో.












