క్రీడలు

ప్రజ్ఞానంద ప్రభంజనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చదరంగంలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ క్రీడా వేదికపై భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తూ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, అమెరికా దిగ్గజం ఫ్యాబియానో కరువానాపై ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు.

భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చదరంగంలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ క్రీడా వేదికపై భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తూ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, అమెరికా దిగ్గజం ఫ్యాబియానో కరువానాపై ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు. దీంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీని సొంతం చేసుకున్న మొట్టమొదటి భారత చెస్ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

 టోర్నీ ఆరంభంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ప్రజ్ఞానంద, చివరి రోజు ఆటలో చూపించిన పునరాగమనం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతకుముందు క్లాసికల్ గేమ్‌లలో వెనుకబడి, ఒక దశలో కరువానా కంటే ఆరు పాయింట్ల తేడాతో ఉన్నప్పటికీ ప్రజ్ఞానంద కొంచెం కూడా ధైర్యం కోల్పోలేదు. ఆఖరి రోజు జరిగిన రెండు ర్యాపిడ్ గేమ్‌లలోనూ వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాడు. ఆ తర్వాత జరిగిన హోరాహోరీ బ్లిట్జ్ గేమ్‌లలో పట్టు నిలుపుకుని, మొత్తంగా 15-13 తేడాతో కరువానాను చిత్తు చేసి విజేతగా నిలిచాడు.

 టైటిల్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా ప్రజ్ఞానంద రూ. 1.91 కోట్ల (2 లక్షల యూఎస్ డాలర్లు) భారీ ప్రైజ్ మనీని అందుకున్నాడు. ప్రారంభంలో తొలి గేమ్‌లో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత తన అపారమైన వ్యూహచతురతతో గేమ్‌ను మలుపు తిప్పిన తీరు క్రీడా పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. కాగా, ఇదే టోర్నీలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో, విన్సెంట్ కైమర్‌ను ఓడించి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

 ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో భారత్‌ వ్యాప్తంగా క్రీడా ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ స్థాయి దిగ్గజాలను ఓడించి సాధించిన ఈ టైటిల్ భారత చెస్ రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని విశ్లేషకులు కొనియాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకునే సత్తా ప్రజ్ఞానందకు ఉందని ఈ విజయం మరోసారి నిరూపించింది.

#Praggnanandhaa#GrandChessTour#ChessChampion#IndianSports#FabianoCaruana#ChessNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి