National

Sugar : సామాన్యులకు షాక్.. చక్కెర కొనుగోలుపై పరిమితులు!

రచన: Kumar4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా చక్కెర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు వారాలుగా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కేజీ షుగర్ రూ.45 నుంచి ప్రస్తుతం రూ.80 వరకు ఎగబాకింది. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు.

దేశవ్యాప్తంగా చక్కెర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు వారాలుగా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కేజీ షుగర్ రూ.45 నుంచి ప్రస్తుతం రూ.80 వరకు ఎగబాకింది. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు.తమ వేతనాలు పెరగడం లేదని కానీ, నిత్యావసరాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగకుండా ప్రభుత్వాలు కట్టడి చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయినప్పటికీ ధరలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా మొన్నటివరకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు ప్లాస్లిక్ రిలేటడ్ ముడిసరుకు ధరలు పెరిగాయని టూత్ పేస్ట్, సబ్బులు, మ్యాగీ, మిల్క్ ప్యాకెట్స్ ఇలా అన్ని పెరుగుతూ పోయాయి. తాజాగా చక్కెర ధరలు పెరగుతూ ఉండటంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో సామాన్యుడు ఉన్నాడు.చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు.

అయితే, దేశంలో ఉన్నట్టుండి చక్కెర ధరలు పెరగడానికి కార్పొరేట్ కంపెనీలు, కేంద్రం తీసుకున్న నిర్ణయమే కారణమని తెలుస్తోంది. పెట్రోల్ మీద ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ మీద వాడాకాన్ని పెంచిన విషయం తెలిసిందే. దీంతో చెరుకు నుంచి ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వలన ఎక్కువ శాతం కంపెనీలు వాటికే వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా సామాన్యుడు వినియోగించే షుగర్ ప్రాసెసింగ్ తగ్గడం, కొందరు సిండికేట్‌గా ఏర్పడి బల్క్‌లో చెక్కెర స్టాక్‌ను నియంత్రించడం,మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా లభ్యత లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్టు సమాచారం

ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెద్దమొత్తంలో కొనుగోలు చేసి స్టాక్ నిల్వ చేయకుండా ఉండేందుకు కొనుగోళ్లపై పరిమితులు విధించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే క్విక్ కామర్స్ కంపెనీలు అయిన బ్లింకిట్, జెప్టో,స్విగ్గీ, ఇన్ స్టామార్ట్ గరిష్టంగా రూ.3 నుంచి 5 కేజీల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు సమాచారం. డీమార్ట్‌ వంటి రిటైలర్ దిగ్గజం కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టు తెలిసింది.

#sugar#bulk purchase#limits#market#price hike
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి