National

Politics : భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వే

రచన: Kumar4 నిమిషాల పఠనం

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గనున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంవోటీఎన్)’ నిర్వహించిన తాజా సర్వే -2026 ఈ విషయాన్ని స్పష్టంచేసింది.కేంద్రంలో ఎన్డీయే కూటమే బలంగా ఉన్నప్పటికీ గత ఆరు నెలలతో పోలిస్తే బలం కొంత తగ్గిందని పేర్కొంది.

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గనున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంవోటీఎన్)’ నిర్వహించిన తాజా సర్వే -2026 ఈ విషయాన్ని స్పష్టంచేసింది.కేంద్రంలో ఎన్డీయే కూటమే బలంగా ఉన్నప్పటికీ గత ఆరు నెలలతో పోలిస్తే బలం కొంత తగ్గిందని పేర్కొంది.జనవరిలో నిర్వహించిన సర్వేలో 352 సీట్లు ఎన్డీయేకు వస్తాయని అంచనా వేయగా.. తాజాగా ఈ సంఖ్య 326కు పడిపోయింది.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు రాగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పార్టీ 261 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని ఎంవోటీఎన్ సర్వే అంచనా వేసింది. కాగా, 2024 ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 106 సీట్లు గెలుచుకోగలదని వెల్లడించింది. అనగా కాంగ్రెస్ స్వల్పంగా బలం పుంజుకుందని తెలిపింది. గత ఎన్నికల్లో ఇండియా కూటమికి 234 సీట్లు రాగా.. ఈ సంఖ్య 185కు తగ్గుతుందని వివరించింది. జెన్ జీ ఆందోళనలు, రాహుల్ గాంధీ బలమైన వాయిస్ వినిపించడం కారణంగా ఎన్డీయే పార్టీ పట్ల కొంత వ్యతిరేకత నమోదైందని ఈ సర్వే పేర్కొంది.

ప్రధాని మోడీ ఇమేజ్ కొంతమేర తగ్గగా.. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగినట్టు అంచనా వేసింది.ఇక వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని ఈ సర్వే వెల్లడించింది. అక్కడ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే యూపీలో ఎన్డీయే ఓడిపోతుందని, ఇండియా కూటమికి స్వల్ప ఆధిక్యత వస్తుందని తెలిపింది. మొత్తం 80 పార్లమెంటు స్థానాల్లో ఇండియా కూటమికి 41 సీట్లు, ఎన్డీయేకు 38 సీట్లు వస్తాయని అంచనా వేసింది..మరోవైపు అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ యూపీలో బీజేపీకి, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రధాని మోడీ క్రేజ్ కొంత తగ్గినట్టు సర్వే అంచనా వేయగా..ఇప్పటికీ ఆయనే ప్రధానిగా బెస్ట్ అని పేర్కొంది. ఆయనకు 48.7 శాతం మంది మద్దతు పలికారని సర్వే తెలిపింది. ఆరునెలల క్రితం ఇదే సర్వేలో ఆయనకు 55 శాతం మద్దతు లభించింది. తాజాగా, ఏడుశాతం ఆదరణ కోల్పోయారు. మోడీ తర్వాత రెండో స్థానంలో రాహుల్ గాంధీ నిలిచారు. జనవరిలో 27 శాతం మంది ఆయనకు మద్దతివ్వగా.. తాజాగా, 27.1 శాతం మంది సపోర్ట్ చేశారు.ఈ జాబితాలోకి అనూహ్యంగా తమిళనాడు సీఎం విజయ్ చేరారు. 9.2 శాతం మంది ఆయనను ప్రధానిగా సమర్థించగా.. తర్వాతి స్థానాల్లో మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌లున్నారు.

#pm modi#mood of the nation survey 2026#rahul gandi#politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి