International

International : టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి

రచన: Kumar•••3 నిమిషాల పఠనం

హిమాలయాలను ఆనుకుని ఉన్న టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. నిన్న సాయంకాలం వేళ 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 16 మంది మరణించారు. 54 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.

హిమాలయాలను ఆనుకుని ఉన్న టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. నిన్న సాయంకాలం వేళ 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 16 మంది మరణించారు. 54 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భూమి లోపల 10 కిమీటర్ల దూరంలో కౌంటీకి 70 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.

టిబెట్‌లో ఒక్కసారిగా భారీ కదలికలతో భూమి కంపించగా విద్యుత్, టెలికమ్యూనికేషన్, రోడ్ వ్యవస్థ కూడా భారీగా దెబ్బతిన్నట్టు సమాచారం.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు టిబెట్ దేశంలో భారీ భవనాలు సైతం నేలమట్టం అయినట్టు సమాచారం.

విద్యుత్‌, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటంతో ప్రభుత్వ అధికారుల నుంచి బాధితులకు సాయం అందడంలో జాప్యం జరుగుతోంది. ఇదిలాఉండగా, భూమి కంపించిన సమయంలో ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అవ్వగా ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

చైనా, పాక్, ఆఫ్ఘాన్‌లోనూ భూకంపం..

శుక్రవారం తెల్లవారుజామున చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో వరుస భూకంపాలు సంభవించాయి. జాతీయ భూకంప కేంద్రం (NCS) కథనం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1 నుండి 4.9 వరకు నమోదు అయ్యింది. అత్యధికంగా పాకిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలిసింది. చైనాలో ఇవాళ ఉదయం 4.4 తీవ్రతతో భూమి కంపించగా, ఆఫ్ఘనిస్థాన్‍లో ఉదయం 5:54 గంటలకు 4.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. ప్రస్తుతం ఆయా దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

#earthquake#pakistan#afganistan#tibet#international#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి