తెలంగాణ

Hyd : కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు

రచన: Kumar••3 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా గల హరిజన సేవా సంఘం కాలనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నివాసం ఉంటున్న వారి పూరి గుడిసెలకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీగా వ్యాపించాయి.

హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా గల హరిజన సేవా సంఘం కాలనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నివాసం ఉంటున్న వారి పూరి గుడిసెలకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఇండ్లు మొత్తం అగ్నికి ఆహుతవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

వివరాల్లోకివెళితే.. హరిజన సేవా సంఘం కాలనీలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమల నివారణ కోసం పెట్టిన పొగ వలన మంటలు చెలరేగి పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయాయి.అంతటితో ఆగకుండా మంటలు పక్కనే ఉన్న కట్టెల షాపునకు వ్యాపించాయి. దీంతో కట్టెల షాపు కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా, మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో వారు ముందుకు వెళ్లలేకపోతున్నట్టు తెలుస్తోంది. కాగా, మంటలు పక్కనే ఇండే ఇళ్లు, వ్యాపార సముదాయాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా, పేదల నివాసముండే పూరి గుడిసెలు పూర్తిగా కాలిపోవడంతో వారంతా తీవ్రఆవేదనకు గురయ్యారు.

గుడిసెల్లోని సామగ్రి పూర్తి దగ్దం అయినట్టు తెలుస్తోంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. పొట్ట కూటి కోసం కూలి పనులు చేసుకుని బతికేవాళ్లమని, ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయామని ..ప్రభుత్వం తమను ఆదుకోకపోతే రోడ్డున పడాల్సి వస్తుందని హరిజన సంఘం వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.

#fire accident#kukatpalli#hyderabad#harijana sagam colony#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి