రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది.ఓ మైనర్‌పై ఏడుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అభం శుభం తెలియని బాలిక(15) అని చూడకుండా తమ లైంగిక వాంఛలు తీర్చుకున్నారు. ఇంట్లో ఎవరి లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లిన దుండగులు.. సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు తెలిసింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్టు సమాచారం. దసరా పండుగ రోజున ఈ దారుణం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
సిద్దిపేట జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ప్రస్తుతం సంచనంగా మారింది. వివరాల్లోకివెళితే.. సిద్ధిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలో బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె పేరెంట్స్ పొలం పనులకు వెళ్లిన సమయంలో స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు.. బాలిక ఆడుకుంటుండగా ఆమెకు మాయమాటలు చెప్పినట్టు తీసుకెళ్లినట్టు సమాచారం. సమీపంలోని మరో గ్రామానికి తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది.
మరుసటి రోజు ఉదయం బాలికను సొంత గ్రామానికి తీసుకొచ్చి వదిలేసి నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయితే, రాత్రంతా ఎక్కడుందని తల్లిదండ్రులు ఆరా తీయగా తనపై చేర్యాల పట్టణం, ధూల్మిట్ట గ్రామానికి చెందిన ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక వెల్లడించింది.దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పేరెంట్స్.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ దారుణ ఘటన గురించి ఫిర్యాదు చేశారు.
బాలిక తెలిపిన వివరాల ప్రకారం ఏడుగురు నిందితుల మీద పోక్సో కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉండగా వారిని జువైనల్ హోమ్‌కు తరలించనున్నట్టు తెలుస్తోంది. కాగా,బాధితురాలికి వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, బాలికపై మీద సామూహిక లైంగిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


