తెలంగాణ

ట్యాంకర్ నీళ్లే దిక్కు.. సాగునీటి ఎద్దడితో అన్నదాత కుదేలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి ఎద్దడి, భూగర్భ జలాలు ఇంకిపోవడం, విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అంతరాయాల కారణంగా వరి పంటలు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే మాడిపోతుంటే తట్టుకోలేక హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఓ రైతు అసాధారణ రీతిలో పోరాడుతున్నాడు.

తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి ఎద్దడి, భూగర్భ జలాలు ఇంకిపోవడం, విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అంతరాయాల కారణంగా వరి పంటలు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే మాడిపోతుంటే తట్టుకోలేక హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఓ రైతు అసాధారణ రీతిలో పోరాడుతున్నాడు. తన ఎనిమిది ఎకరాల వరి పంటను దక్కించుకునేందుకు నీటి ట్యాంకర్ల ద్వారా పొలానికి నీరు అందిస్తూ పంటను తడిపే ప్రయత్నం చేస్తున్నారు.

 ఇప్పటికే నాలుగు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పొలానికి పారిస్తున్న దృశ్యాలు స్థానికంగా తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ ప్రస్తుతం ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరైన సమయానికి నీరు అందక, విద్యుత్ కోతల కారణంగా బోర్లలో నీళ్లు రాక వేల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. కష్టపడి వేసిన పెట్టుబడి, పడ్డ శ్రమ అంతా వృథా అయిపోతుందన్న భయంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 పంటను కాపాడుకునేందుకు ఎంత ఖర్చయినా వెరవకుండా ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తుండటంతో ప్రతీ రోజు వేల రూపాయలదనపు భారం రైతుల నెత్తిన పడుతోంది. పంట పొట్టదశకు వచ్చిన ఈ కీలక సమయంలో సాగునీరు అందకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. రోజువారీ ట్యాంకర్ల ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లు ఇంకిపోవడం, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతన్నలు పడుతున్న అరిగోస.. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర సాగునీటి సంక్షోభానికి అద్దం పడుతోంది. ప్రభుత్వం, సంబంధిత వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి సాగునీటి ఎద్దడి తలెత్తిన ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని విడుదల చేయాలని, వ్యవసాయానికి అప్రతిహతంగా విద్యుత్ అందించాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

#TelanganaWaterCrisis2026#FarmerStruggleTG#HanamkondaFarmers#PaddyCropDrying#WaterTankerForFarms#TelanganaAgriculture#RegionalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి