జెన్ కో బూడిదను కార్పొరేట్ కంపెనీ ఎత్తుకెళ్తే టన్నుకు రూ.70
ఆ కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీలకు, బ్రిక్స్‌కు రూ.500 అమ్ముకునేందుకు అవకాశం
ఇప్పటి వరకు కేటీపీపీలో రూ.520కి టెండర్ ఇచ్చిన సంస్థ
నాలుగు యూనిట్లను ఒకే కంపెనీకి మూడేళ్లు కట్టబెట్టడం వెనుక కమీషన్ల దందా?
ఖమ్మం మంత్రి చక్రం తిప్పారని 2 వేల మంది స్థానికుల ఆరోపణ
లిఫ్ట్ చేయకపోతే 10 శాతం ఫైన్‌తో ఆ కంపెనీకి ఒరిగేది లేదు?
గిరాకీ ఉన్న ఏరియాలో భారీ ఆదాయంపై దృష్టి?
డిమాండ్ లేని ప్రాంతంలో ఫైన్ వేసినా తప్పించుకునేందుకు వీలుగా టెండర్
గతంలో కోర్టుకు వెళితే స్థానికులకే ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు
గాలికే వదిలేసిన సెంట్రల్ ఉత్తర్వులు.. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు
100 కిలోమీటర్ల లోపు ప్రజలకు ఫ్రీగా ఇవ్వరు.. ప్రభుత్వ పనులకు తరలించరు
పాండ్‌లు నిండడంతో నీళ్లతో పాటు ఆష్‌ని వదిలేస్తున్న జెన్ కో కంపెనీ
బీటీపీసీలో రోగాల బారిన పడుతున్న గిరిజన కుటుంబాలు
కొన్నాళ్ల క్రితం టెండర్స్‌లో అనుంగ నేతలకే కట్టబెట్టిన వైనం
సరైన బొగ్గును తెచ్చుకోలేని జెన్ కో.. బూడిదను సైతం వదలకుండా చేస్తున్న దందాపై స్వేచ్ఛ న్యూస్ ఇన్వెస్టిగేషన్ కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.
హైదరాబాద్‌లో హోర్డింగ్స్‌పై 200 కుటుంబాలు రోడ్డుపాలు అవుతున్నాయని ఏటా రూ.300 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టే మాఫియా చేసిన ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం, నాయకుల విచ్చలవిడితనంతో ఏటా వెయ్యి కోట్లు సంపాదిస్తోంది. టీజీ జెన్ కో బొగ్గు కోసం కాకుండా బూడిద కమీషన్స్ కోసం చేస్తున్న దందాతో 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నాలుగు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్‌కి ఒకే టెండర్ ఏటా రూ.93 కోట్లతో బుడిద అమ్ముకునేందుకు చేసిన వ్యాపారం విలువ, లొసుగులు, ఆ తర్వాత పర్యావరణ విధ్వంసం ఏంటో చూస్తే దీన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వదలడం లేదని అనిపిస్తుంది.
బూడిద దొంగలు అనాలనిపిస్తుంది. ఒకొక్క ఏరియా ప్లై ఆష్‌కి ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది. అది భౌగోళికంగా, క్వాలిటీల రూపంలో ఉంటుంది. దాన్ని క్యాచ్ చేసుకుని రామగుండం ప్లాంట్ నుంచి ఓ ఎమ్మెల్యే లారీల నుంచి వసూలు చేస్తున్న దందా రోజుకు రూ.20 లక్షలు అని ప్రత్యక్షంగా ఆరోపణలు వచ్చాయి. సిమెంట్ ఫ్యాక్టరీకి, బ్రిక్స్‌కి, మట్టి ఇటుకలకు అమ్మే బుడిద మార్కెట్‌లో రూ.600 రూపాయలకు ఎక్కువగానే టన్ను ధర పలుకుతోంది. ఒకానొక్క సమయంలో ప్రభుత్వ ఇసుక రేటుతో సమానంగా అమ్ముకుని క్యాచ్ చేసుకుంటున్నారు.
చట్టం ఏం చెబుతోంది.. జెన్ కో ఏం చేస్తోంది..
బొగ్గుతో ఉత్పత్తి అయ్యే కరెంట్ ప్రాజెక్ట్‌లో బుడిద అనేక ఆర్థనాదాలకు దారి తీస్తోంది. చుట్టూ 10 కిలో మీటర్ల దూరంలో దుమ్ము, దూళితో పాటు 100 కిలో మీటర్ల దూరంలో ఉండే చిన్న పరిశ్రమలకు బూడిద ఉచితంగా ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. అలాగే, 300 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రాజెక్ట్స్‌కి ప్లై ఆష్, బాటయ్ ఆష్‌ని సప్లై చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనుమతి లేని పరిశ్రమలకు, అనుమతులు ఉండే సిమెంట్ కంపెనీలకు, బ్రిక్స్ ఫ్యాక్టరీలకు ఇవ్వాల్సిందే. కానీ, బూడిదను మార్కెట్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక్కొక్క టన్ను నాన్ ట్రైబల్ ఏరియాలో మూడు వంతులు పెంచారు. అయినా ఇదే వ్యాపారంలో ఉండే వాళ్లు ఉపాధి కోసం జీఎస్టీతో పాటు టన్నుకు రూ.520 చెల్లించి వ్యాపారం చేశారు.
రామగుండంలో ఆష్ ధర తక్కువ ఉండటంతో అమ్మేసుకుంటున్నారు. ఒక్కొక్క లారీకి నెలకు రూ.25వేల చొప్పున ఎమ్మెల్యేనే వసూలు చేసుకుని దందాలు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అలానే ఇప్పుడు నాలుగు పవర్ ప్రాజెక్ట్స్ నుంచి వెలువడే బుడిదను ఎప్పుడూ లేని విధంగా ఒకే కార్పొరేట్ కంపెనీకి టన్నుకు రూ.70 చొప్పున మూడేళ్లు కట్టబెడుతున్నారు. అందుకు హైదరాబాద్‌కి 200 కిలో మీటర్లలోపు ఉండే యాదాద్రి ప్లాట్‌కి పెద్ద మొత్తంలో ఇప్పుడు ఈ బిజినెస్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలకు, హైదరాబాద్ ఇండస్ట్రీకి 70 రూపాయలకు కొనుగోలు చేసిన ఆష్‌ని టన్నుకు రూ.500 తక్కువ కాకుండా అమ్ముకుని బిజినెస్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. పైగా కొత్తగా ఏర్పడిన ప్లాంట్‌కి స్థానికులకు చట్టాలు తెలియవు. చుట్టూ 100 కిలో మీటర్ల సన్న, మధ్య తరగతి అవసర వ్యాపారులకు టన్ను రూ.50కి మించొద్దని తెలియదు. పాత మూడు ప్లాంట్స్‌లో స్థానికుల బిజినెస్ తెలిసి ర్యాప్‌ల ఖర్చులు, జేసీబీ, లారీ వ్యాపారాలతో నడిపించుకునే వారు. ఇలా గత 6 నెలల క్రితం వివిధ ప్లాంట్ యజమాన్యంతో ఒక జీవో తీసుకొచ్చారు.
30 శాతం కమీషన్ వ్యవహారం.. తర్వాతి కథనంలో..
బూడిదలో 50 శాతం తోడకుండా ఉంటే 10 శాతం పెనాల్టీ, రెండో ఏడాది 80 శాతం తోడకుంటే పెనాల్టీ, మూడో ఏడాది వంద శాతం తోడకుంటే పెనాల్టీ వేస్తారు. అయితే, కొత్త జీవోలను తీసుకొచ్చి మరీ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు మంత్రి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాతి కథనంలో చూద్దాం.


