సినిమా

Mahesh Babu: బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేస్తున్న సూపర్ స్టార్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Mahesh Babu: మన టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంతో క్రేజ్. ఎలాగైనా అక్కడ స్ట్రైట్ సినిమాలను చేయాలని చాలా ప్రయత్నిస్తుంటారు. నేరుగా అడగలేక అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా రాయబారం పంపి హిందీ ఆఫర్స్ గురించి ఆరా తీస్తుంటారు. కానీ, మన టాలీవుడ్‌లో ఒకే ఒక్క స్టార్ హీరో మాత్రం అసలు హిందీ సినిమా అంటే ఆమడ దూరం ఉంటాడు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు.

Mahesh Babu: మన టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంతో క్రేజ్. ఎలాగైనా అక్కడ స్ట్రైట్ సినిమాలను చేయాలని చాలా ప్రయత్నిస్తుంటారు. నేరుగా అడగలేక అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా రాయబారం పంపి హిందీ ఆఫర్స్ గురించి ఆరా తీస్తుంటారు. కానీ, మన టాలీవుడ్‌లో ఒకే ఒక్క స్టార్ హీరో మాత్రం అసలు హిందీ సినిమా అంటే ఆమడ దూరం ఉంటాడు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు.

బాలీవుడ్ కలిసిరాని టాలీవుడ్ స్టార్స్:

మెగాస్టార్ చిరంజీవి ఆజ్‌కా గూండారాజ్ అనే సినిమాను చేశాడు. టాలీవుడ్‌లో ఆయన మెగాస్టార్. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఒక్క సినిమా కూడా భారీ హిట్ సాధించలేదు. అక్కడ్నుంచి ఆఫర్స్ కూడా చిరుకి వచ్చిన దాఖలాలు లేవు. బాలయ్య, వెంకీ చేయలేదు. నాగార్జున అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఖుదాగవా చేశాడు. అంతే తప్ప అక్కడ స్ట్రైట్ సినిమాను చేయలేదు. చెప్పాలంటే, సీనియర్ హీరోలెవరూ హిందీ సినిమా కోసం సాహసం చేయలేదు.

ఈ జనరేషన్ హీరోలకి కలిసి రాని హిందీ సినిమా:

ఈ జనరేషన్ హీరోలలో ఆదిపురుష్ సినిమాను ప్రభాస్ చేశాడు. అది డిజాస్టర్. బెల్లంకొండ శ్రీను తెలుగు బ్లాక్ బస్టర్ ఛత్రపతి హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఎన్‌టిర్ గ్రాండ్‌గా హిందీలో ఎంట్రీ ఇచ్చి హృతిక్ రోషన్‌తో వార్ సినిమాను చేశాడు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ దెబ్బతో మళ్ళీ తారక్ హిందీ సినిమాకి సైన్ చేయడు. కెరీర్ ప్రారంభంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను చేస్తే వికటించింది. మళ్ళీ, ఇప్పటి వరకూ చరణ్ బాలీవుడ్ సినిమా వైపు చూడలేదు.

మహేష్ కి హిందీ రాదనే ఒప్పుకోడా?

హిందీలో సినిమాలు చేయడానికి మన టాలీవుడ్ స్టార్ హీరోలందరికంటే కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎక్కువ స్కోప్ ఉంది. మహేష్ ఫిజిక్, అండ్ స్టార్ డమ్ కి జస్ట్ అలా ఓకే అంటే చాలు ఎన్నో హిందీ సినిమాలు వచ్చి పడతాయి. తన భార్య నమ్రతకి బాలీవుడ్‌లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ, మహేష్ కి భాష సమస్య. ఆయనకి హిందీ మాట్లాడటం రాదట. అందుకే, ఎన్నో ఏళ్ళనుంచి వస్తున్న హిందీ ఆఫర్స్ రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల కూడా ధూమ్ 4లో క్రేజీ ఆఫర్ వస్తే కూడా సింపుల్‌గా నో అని రిజెక్ట్ చేశాడట. జీవితాంతం మన తెలుగు సినిమాలకి, తెలుగు చిత్ర పరిశ్రమే అంకితం తప్ప ఇంకో భాషలో అడుగుపెట్టే ఆసక్తే లేదని గతంలోనే తేల్చి చెప్పాడు సూపర్ స్టార్.

#Super Star Mahesh Babu#Dhoom 4#Bollywood#Tollywood Stars
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి