తెలంగాణ

Indiramma Illu: రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు

3 నిమిషాల పఠనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్థిక అవరోధాలు ఎదురైనా పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలన్న సంకల్పంతో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Indiramma Illu: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్థిక అవరోధాలు ఎదురైనా పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలన్న సంకల్పంతో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి సూచన మేరకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గృహ ప్రవేశాలు పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి రోజున ఈ వేడుకలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి అనే పోస్టర్ ను ఆవిష్కరించారు.

#Indiramma Illu#Telangana#Cm Revanth Reddy#Ponguleti Srinivas Reddy#Maa Indiramma Intlo Deepawali#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి