Bloody Romeo: మన టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ గా నానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, దానికి తగ్గట్టు సక్సెస్‌లు దక్కడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. అవేవీ నానికి ఆశించిన విజయాలను ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియోపైనే ఉంది. ఈ సినిమాతో అయినా నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కథ, క్యారెక్టర్ విషయంలో కొత్తదనం!
ఓజీ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను చాలా స్టైలిష్‌గా తెరకెక్కిసున్నాడు. ఇప్పటివరకు విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో నానిని చెఫ్ అండ్ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో పరిచయం చేశాడు. అంటే వంట చేసే వ్యక్తిగా కనిపిస్తూనే మరోవైపు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఉంటాడన్నది ఆసక్తికరంగా చూపించనున్నాడు సుజీత్. సుజీత్ డైరెక్షన్‌లో ఇంతకముందు వచ్చిన సాహో, ఓజీ సినిమాలను చూస్తే ఆయనకు స్టైలిష్ యాక్షన్‌పై మంచి పట్టుందని అర్థమవుతుంది. ఇప్పుడు నాని కోసం కూడా అలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. ముఖ్యంగా యాక్షన్‌తో పాటు డార్క్ హ్యూమర్, కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటాయని నాని స్వయంగా వెల్లడించారు.
"ది ప్యారడైజ్" తర్వాత బాధ్యత మరింత పెరిగిందా?
నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మిశ్రమంగా ఉండటంతో ఆశించిన స్థాయిలో హిట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో బ్లడీ రోమియో హిట్ నానికి చాలా కీలకంగా మారింది. ఒకే తరహా మాస్ యాక్షన్ సినిమాలు కాకుండా, ప్రతిసారీ కొత్త కథలు, కొత్త పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనేది నాని ప్రయత్నం. అయితే, అలాంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు కథలో బలంతో పాటు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉండాలి.
నాని కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే ప్రతి సినిమాతోనూ తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలంటే సరైన కథలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. బ్లడీ రోమియో విషయంలో నాని, సుజీత్ ఇద్దరూ కొత్త ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా, అభిమానులు కోరుకునేది ఒక్కటే. ఈ మధ్య సరైన హిట్ లేదు గనక నాని నుంచి సాలీడ్ హిట్ రావాలి. అది కూడా థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసే సినిమా కావాలి. బ్లడీ రోమియోతో నాని తన సక్సెస్ ట్రాక్‌లోకి తిరిగి వస్తారా? సుజీత్ తన స్టైలిష్ టేకింగ్‌తో నానికి బ్లాక్‌బస్టర్ అందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, నానికి ఈ సినిమా సక్సెస్ తప్పనిసరి.


