సినిమా

RC 17: ఆర్సీ 17 కోసం రామ్ చరణ్ కి తగ్గ హీరోయిన్ దొరకడం లేదా?

5 నిమిషాల పఠనం

RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు హీరోయిన్ ఎంపిక ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు?

RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు హీరోయిన్ ఎంపిక ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు? ఈ పాత్రకు సరిపోయే కథానాయిక కోసం చిత్రబృందం ఇంకా అన్వేషణ కొనసాగిస్తోంది.

హీరోయిన్ ఎంపిక ఎందుకింత ప్రత్యేకం?

ఆర్య నుంచి కూడా సుకుమార్ సినిమాల్లో హీరోయిన్లకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో కీలకమైన పాత్రను కథానాయికలకు ఇస్తుంటారు. రంగస్థలం సినిమాలో సమంత పాత్ర ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే, ఆర్య, పుష్ప చిత్రాలు. అందుకే ఆర్సీ 17లో కూడా హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి.

మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆయన ఇమేజ్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా హీరోయిన్ ఎంపిక చేయడం కూడా మేకర్స్‌కు కీలకమైన విషయమే. మహేష్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి కి కూడా రాజమౌళి ఇలాగే, గ్లోబల్ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రాను ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేక కథకు ప్రాధాన్యమిస్తూ కొత్త కాంబినేషన్‌ను సెట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సుకుమార్ సాధారణంగా తన కథలకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి ఆర్సీ 17లో హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సినిమా కథ, నటీనటులు, హీరోయిన్ ఎంపిక వంటి విషయాలపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. నిన్నా మొన్నటి వరకూ సారా అర్జున్, అనీత్ పడ్డా పేర్లు పరిశీలనలో ఉన్నాయని, మరో బ్లాక్‌బస్టర్ హీరోయిన్‌ను కూడా సుకుమార్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. పెద్ది సినిమా విషయంలో జాన్వీ కపూర్ ఎంపిక పెద్ద పొరపాటని కామెంట్స్ చేశారు. ఇప్పుడు, అలాంటి సమస్యలు రాకూడదనే సుకుమార్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.

#RC 17#Ram Charan#Sukumar#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి