జాతీయం

Hormuz: హర్మూజ్‌లో భారత నౌకలకు ఇరాన్ స్పెషల్ పర్మిషన్!

4 నిమిషాల పఠనం

Hormuz: ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత వాణిజ్య నౌకలకు ఇరాన్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ.. తమ మిత్రదేశాల నౌకలపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Hormuz: ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత వాణిజ్య నౌకలకు ఇరాన్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ.. తమ మిత్రదేశాల నౌకలపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని తేల్చి చెప్పింది.

ఇరాన్ కీలక ప్రకటన

ఈ నిర్ణయంపై ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. "ప్రస్తుతం హర్మూజ్‌లో విధించిన రవాణా ఆంక్షల నుంచి భారత్, చైనా, ఇరాక్, ఖతార్‌లకు పూర్తి మినహాయింపు ఇచ్చాం. ఇకపై ఈ దేశాల నౌకలు జలసంధిలో ఫ్రీగా ప్రయాణించవచ్చు. చివరికి అమెరికన్లు కూడా వాటి జోలికి రాలేరు, అడ్డుకోలేరు" అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా జలాల్లో అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా, తమ దౌత్య, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

భారత్ నుంచి మందుల సరఫరా ఆగకూడదనే

ఈ స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా ఇరాన్ సూటిగానే బయటపెట్టింది. భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు కీలకమైన ఔషధాల (ఫార్మా) సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలనే ఉద్దేశంతోనే భారత్‌కు ఈ వెసులుబాటు కల్పించామని తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ వేదికలపై తమకు అవసరమైన రాజకీయ మద్దతు కోసం చైనా నౌకలకు కూడా లైన్ క్లియర్ చేసినట్లు వెల్లడించింది. అయితే నౌకల రాకపోకలపై ఆంక్షలు తొలగించినప్పటికీ, రూల్స్ ప్రకారం ట్రాన్సిట్ ఫీజు మాత్రం యథావిధిగా వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నౌకాయానంపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో.. హర్మూజ్ మార్గంలో భారత నౌకలకు ఈ విధమైన ప్రత్యేక అనుమతి దక్కడం మన వాణిజ్య రంగానికి, ముఖ్యంగా ఫార్మా ఎగుమతులకు దక్కిన పెద్ద ఊరటగా చెప్పవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Hormuz Strait#Iran#India#Indian Ships#Iran India Relations#Strait of Hormuz#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి