తెలంగాణ

Indiramma Towers: అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్లు- మంత్రి పొంగులేటి

2 నిమిషాల పఠనం

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ తరహాలోనే కార్పొరేషన్లుగా ఉన్న పట్టణాల్లోనూ అల్పాదాయ కుటుంబాలకు G+5 ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Indiramma Towers: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ తరహాలోనే కార్పొరేషన్లుగా ఉన్న పట్టణాల్లోనూ అల్పాదాయ కుటుంబాలకు G+5 ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. తొలి విడతలో నాలుగు నగరాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.

నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ కార్పొరేషన్ల పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష జరిపారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా గృహ ప్రవేశాలు జరిగిన ఇందిరమ్మ ఇళ్లలో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కాన్సెప్ట్‌తో దీపావళి వేడుకలు జరపాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.

#Indiramma Towers#Indiramma Illu#Minister Ponguleti Srinivas Reddy#Corporations#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి