National

National : కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు సర్కారీ కొలువు : సీఎం సువేందు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజ నవరాత్రుల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. చోర్‌బగాన్‌లోని దుర్గమాత పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 19మంది చనిపోయారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజ నవరాత్రుల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. చోర్‌బగాన్‌లోని దుర్గమాత పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 19మంది చనిపోయారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదం చోటుచేసుకోవడానికి కారకులైన నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం భారీ వర్షం కురవడంతో చోర్‌బాగన్ దుర్గా పూజ మండపం వద్ద గందరగోళం నెలకొంది.తడవకుండా ఉండేందుకు భక్తులు అటు ఇటు పరుగులు పెట్టారు.

దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఆ వెంటనే క్యూ లైన్లలో ఉన్న వారు వెనుక నుంచి ముందుకు దూసుకుని రావడంతో తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఏడో రోజైన సప్తమి సందర్భంగా అద్భుతంగా ఏర్పాటు చేసిన దుర్గామాత థీమ్ పాండాల్‌ను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీ పెరగడం కూడా తొక్కిసలాటకు మరో కారణంగా తెలుస్తోంది.

ఇదిలాఉండగా, తొక్కిసలాటలో మరణించిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగంతో పాటు రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. సీఎం, సీఎస్ కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

అంతేకాకుండా, ఈ ఘటనపై దర్యాప్తునకు కలకత్తా హైకోర్టుకు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం, ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సిట్‌లో ఎస్‌టీఎఫ్‌, సీఐడీ సహా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. కాగా,,

చోర్‌బాగన్ దుర్గా పూజ నిర్వాహకులు చేసిన ప్రకటన కారణంగానే భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకు రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి తెలిపారు. అంతేకాకుండా, దుర్గా పూజ మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లపై సీఎం సువేందు అధికారి కీలక సూచనలు చేశారు.థీమ్ ఆధారంగా ఏర్పాటు చేసే మండపాల్లో తగినంత వెలుతురు ఉండేలా చూడాలన్నారు. సందర్శకుల రాకపోకలకు సరిపడా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

#kolkata#westbengal#stampade#government jobs#victim familes#Cm suvendu adikari#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి