క్రైమ్

TG : హైదరాబాద్ దాండియా వేడుకల్లో విషాదం.. ఇద్దరు యువతులు మృతి!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన దాండియా వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. లైటింగ్ స్టాండ్ మీద పడి ఇద్దరు యువతులు మృతి చెందినట్టు తెలుస్తుండగా..మరో 14 మందికిపైగా విద్యార్థులు గాయపడినట్టు సమాచారం.

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన దాండియా వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. లైటింగ్ స్టాండ్ మీద పడి ఇద్దరు యువతులు మృతి చెందినట్టు తెలుస్తుండగా..మరో 14 మందికిపైగా విద్యార్థులు గాయపడినట్టు సమాచారం. నగర శివార్లలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి ఘనంగా దాండియా వేడుకలు నిర్వహించారు. కళాశాల వార్షికోత్సవ సెలబ్రేషన్స్ ‘సంగమం’ ముగింపు వేడుకల్లో నిర్వహించిన దాండియా నైట్‌లో ప్రమాదవశాత్తు లైటింగ్ స్టాండ్ కూలిపోయింది.

బలమైన ఈదురుగాలులు వీచడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు సుమారు 80 అడుగుల ఎత్తులో భారీ ఇనుప లైటింగ్ పోల్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ సంతోషంగా దాండియా డ్యాన్సులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు లైటింగ్ పోల్ వారిపై కుప్పకూలింది. ఈ ఘటనలో వనపర్తికి చెందిన బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సోనా (సోని) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద తీవ్రత కారణంగా మరో విద్యార్థిని కూడా మరణించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో మరో 14 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. మృతురాలు సోనా సోదరితో పాటు మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ భారీ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యం పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ప్రాథమిక విచారణలో తేలింది.లైటింగ్ కోసం నిలబెట్టిన భారీ ఇనుప పిల్లర్లకు ఎలాంటి పటిష్టమైన సపోర్ట్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని దాండియా వేడుకలకు హాజరైన విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఇదిలాఉండగా,ఈ విషాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించడంతో పాటు, భద్రతా లోపాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.ఈవెంట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

#Dandiya celebrations#Nadargul#light poll fallen#two girls died#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి