సినిమా

Anurag Kashyap: టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికాడా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Anurag Kashyap: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సౌత్ అండ్ నార్త్ లో ఉన్న పాపులర్ నటులకి అవకాశం ఇస్తుంటుంది. ఈ విషయంలో, కొందరు తప్పు పట్టినప్పటికీ పాత్రకి తగ్గ నటుడు లేదా నటి కావాలంటే మేకర్స్ కాంప్రమైజ్ కావడం లేదు. మన తెలుగు నటీనటులను ఇతర భాషల వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయరనే మాట గతంలో వినిపించింది. ఇది వాస్తవం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ సీనియర్ దర్శక-నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు.

'డెకాయిట్‌'తో టాలీవుడ్ ఎంట్రీ:

అడవి శేష్ నటించిన 'డెకాయిట్' సినిమాతో బాలీవుడ్ దర్శక నటుడు అనురాగ్ కశ్యప్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నటన పరంగా బాగానే ఆకట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాలలో ఎప్పటి నుంచో నటించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ వస్తున్నారు. జనాలలో కూడా కొత్త వాళ్ళను చూడాలనే ఆసక్తి నెలకొంది. అందుకే, మన దర్శకులు ఇతర భాషలలో క్రేజ్ ఉన్న వాళ్ళను తీసుకుంటున్నారు.

"కాకా"లో కీలక పాత్ర:

అనురాగ్ కశ్యప్ "డెకాయిట్" సినిమా తర్వాత మళ్ళీ సాలీడ్ ఆఫర్ అందుకున్నాడు. అదే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న "కాకా". దర్శకుడు బాబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ మంచి విజువల్ ట్రీట్ ఇవ్వబోతుంది. 2027, సంక్రాంతికి బరిలో దిగబోతుంది. ఈ సినిమాలో అనురాగ్ కి మంచి రోల్ ఆఫర్ ఇచ్చాడు బాబి. ఇటీవల సెట్స్‌లో జాయిన్ అయిన విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పిక్‌ను వదిలారు.

బాలయ్యకి విలన్‌గా అనురాగ్?

కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తన 112వ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. ఇందులో కూడా అనురాగ్ కశ్యప్ నటించబోతున్నట్టుగా తాజా సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే ఓ పవర్‌ఫుల్ రోల్ లో అనురాగ్ కశ్యప్ నటించబోతున్నాడట. దీనిపై, త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, బాలీవుడ్‌లో కాస్త ఇబ్బందులు పడుతున్న అనురాగ్ కశ్యప్‌కి టాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ రావడం ఆసక్తికరం.

#Anurag Kashyap#Director Anurag Kashyap#Megastar's Kaaka#Director Bobby
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి