సినిమా

Kiara Advani: కి అండ్ కా సీక్వెల్‌లో కియారా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Kiara Advani: కియారా అద్వానీ..అటు బాలీవుడ్ ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్. తాజాగా ఆమె నటించిన పాన్ ఇండియన్ సినిమా టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద ప్రదర్శింపబడుతోంది. యష్ సరసన ఆమె వైల్డ్ పర్ఫార్మెన్స్‌తో బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. అదే 'కి అండ్ కా'.

Kiara Advani: కియారా అద్వానీ..అటు బాలీవుడ్ ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్. తాజాగా ఆమె నటించిన పాన్ ఇండియన్ సినిమా టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద ప్రదర్శింపబడుతోంది. యష్ సరసన ఆమె వైల్డ్ పర్ఫార్మెన్స్‌తో బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. అదే 'కి అండ్ కా'.

2016 లో వచ్చింది 'కి అండ్ కా'. ఈ సినిమాలో కరీనా కపూర్, అర్జున్ కపూర్ జంటగా నటించారు. ఇంటి పనులను చేసే భర్తగా అర్జున్..కెరీర్ మీద దృష్టి పెట్టే మహిళ పాత్రలో కరీనా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆర్.బాల్కి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్ అయింది. ఇలాంటి విభిన్నమైన మనుషులు..వ్యక్తిత్వాలు సమాజంలో ఉన్నాయని కళ్ళకి కట్టునట్టుగా చూపించారు. కమర్షియల్‌గా ఈ సినిమా మంచి లాభాలను, విమర్శకుల ప్రశంసలను తెచ్చిపెట్టింది.

అయితే, సరిగ్గా పదేళ్ళ తర్వాత మళ్ళీ 'కి అండ్ కా' చిత్రానికి సీక్వెల్‌ని నిర్మించే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే, ఆ కథకి కొనసాగింపుగా కాకుండా, కొత్త కథను..ఇప్పటి జనరేషన్‌లో వచ్చిన మార్పులకి అనుగుణంగా కథాంశం ఉండబోతుందట. అప్పట్లో కరీనా కపూర్ పోషించిన పాత్రను ఇప్పుడు కియారా అద్వానీతో చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే, కియారాతో ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది.

కియారా ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని బాలీవుడ్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం. ఇక, హీరో పాత్ర కోసం అన్వేషణ జరుగుతోందట. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో ఒక్కసారిగా కియారా స్టార్ హీరోయిన్‌గా మారింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌తోనూ అందరినీ మెప్పించింది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి కియారా పెద్ద సాహసమే చేసింది. కాబట్టే..ఇప్పుడు, టాక్సిక్ లాంటి సినిమాను ఒప్పుకుంది..విమర్శలు ఎదుర్కుంటోంది. కారణం,అసలు ప్రాధాన్యత లేని పాత్ర కావడమే.

#Kiara Advani#Ki And Kaa Sequal#R.Balki#Toxic#Yash
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి