తెలంగాణ

Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రచన: NK•••5 నిమిషాల పఠనం

అలంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకంలో భాగంగా ఇప్పటికే పలు పనులు చేశామని, భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని పవిత్ర జోగులాంబ ఆలయంలో మల్టీమీడియా ‘సౌండ్ అండ్ లైట్ షో’ను కిషన్ రెడ్డి ప్రారంభించారు.

Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకంలో భాగంగా ఇప్పటికే పలు పనులు చేశామని, భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని పవిత్ర జోగులాంబ ఆలయంలో మల్టీమీడియా ‘సౌండ్ అండ్ లైట్ షో’ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్ ఆలయాలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారని, భక్తులకు ప్రతి రోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేస్తూ ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తాను ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులను కేటాయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

గోల్కొండ కోట, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశామన్నారు. జోగులాంబ రైల్వేస్టేషన్ ను అమృత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేశామని, ఈ ప్రాంత వాసులు అలంపూర్ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివరించారు.

Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అలంపూర్ ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భాగంగా అన్నదాన భవనం, విశ్రాంతి గదులు, ఫుడ్ కోర్టు, కల్చరల్ థియేటర్, తదితర విభాగాలతో పాటు తుంగభద్ర నదిలో బోటింగ్ సౌకర్యాలు కల్పించడం జరిగిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. అమృత్ పథకంలో భాగంగా జోగులాంబ రైల్వే స్టేషన్ తో పాటు గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు వివరించారు.

Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అలంపూర్ ఆలయ విశిష్టతను తెలియజేస్తూ మల్టీమీడియా సౌండ్ లైట్స్ ప్రదర్శన ఏర్పాటు చేయడంతో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆలంపూర్ ఆలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. డోర్నకల్ నుంచి గద్వాలకు రైల్వే లైన్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

#Kishan Reddy#Multimedia Sound Light Show#Jogulamba Temple#Alampur#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి