Tollywood: కథ-కథనం, పాత్రల ఎంపిక, బడ్జెట్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఏ దర్శకుడైనా సినిమాను మూడు నెలల్లో రిలీజ్ చేస్తారనడానికి పూరి జగన్నాధ్ పెద్ద ఉదాహరణ. ఆయనలా వారం రోజుల్లో కథ, ఇంకో వారం రోజుల్లో డైలాగ్స్ కంప్లీట్ చేసే దర్శకరచయిత ఇంకొకరు ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రీలో లేడనే చెప్పొచ్చు. 60 రోజుల్లో షెడ్యూల్ కంప్లీట్ చేయడం పూరికే సాధ్యమైంది. ఇంకా, తక్కువ రోజుల్లోనూ పూర్తి చేసిన సినిమాలున్నాయి.
ఏళ్ళతరబడి సినిమా చేస్తే అది బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇలాంటి సినిమాలు ఉదాహరణకి చాలానే ఉన్నాయి. వాటిలో ప్రభాస్ నటించిన సినిమాలున్నాయి. ఇటీవల రిలీజైన టాక్సిక్ అయితే ఏకంగా మేకింగ్ కోసం నాలుగేళ్ళు సమయం పట్టింది. కానీ, 100 రోజుల్లో సినిమాను రిలీజ్ చేస్తే అది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమానే పూరి-మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి. ఈ సినిమా 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టింది.
పూరి తర్వాత అనిల్ రావిపూడి:
ఇక, రేస్‌లో పూరి జగన్నాధ్ బాగా స్లో అయ్యాడు. ఇప్పుడు ఆ రేంజ్ స్పీడ్‌లో అనిల్ రావిపూడి సినిమాను తీసి రిలీజ్ చేస్తున్నాడు. అయితే, పూరిలా 100 రోజుల్లో సినిమాను రిలీజ్ చేయడం లేదు. కానీ, ఖచ్చితంగా ఏడాదికొక సినిమాను రిలీజ్ చేస్తున్నాడు..బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాడు. ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి 9 బ్లాక్ బస్టర్స్ తీశాడు. 2027 సంక్రాంతికి మళ్ళీ మల్టీస్టారర్‌తో వస్తున్నాడు. అయితే, అనిల్ రావిపూడి కంటే స్పీడ్‌గా సినిమా తీసే దర్శకుడు లైన్‌లోకి వచ్చాడు.
ట్రెండింగ్‌లో అశ్వత్ మారిముత్తు:
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ సినిమాను చేస్తున్నాడు. ఇది రజినీ కెరీర్‌లో 173వ సినిమా. రాజ్ కమల్ ఇంటర్‌నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే, ఈ సినిమాకి ముందు పలువురు క్రేజ్ ఉన్న డైరెక్టర్స్‌ని పరిశీలించిన కమల్..ఫైనల్‌గా అశ్వత్ మారిముత్తుని ఒకే చేశాడు. ఇప్పటికే, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.
ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. 2027, జనవరి.. సంక్రాంతికి బరిలో దింపబోతున్నారు. కేవలం 5 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేయబోతుండటం విశేషం. ఇక, ఈ సినిమాకి ధర్మన్: ది డెడ్లీ డాక్టర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సిమ్రన్, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.











