International

Nepal-floods: నేపాల్ భీభత్సం పై శాస్త్రవేత్తల నివేదికలో సంచలన నిజాలు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా ఒదిగుకున్న అందమైన నేపాల్‌ను, ప్రకృతి వినాశకర రూపంలో క్షణాల్లో శ్మశానవాటికగా మార్చివేసింది. లంగ్-టాంగ్ జాతీయ పార్క్ ప్రాంతంలో మంచు పర్వత భాగాలు విరిగిపడటం, భోటె కోశి, త్రిశూలి నదుల ఉప్పెనలతో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు ఇక్కడి ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.

ఈ జీవితం నిరంతరం చేసే యుద్ధమని అంటారు.. అమ్మకడుపులో నుండి బయటపడిన క్షణం నుండి ఊపిరి పీల్చుకోవడానికి పసికందు చేసే మొదటి ఏడుపుతోనే ఈ జీవన పోరాటం మొదలవుతుంది. మనిషి ప్రయాణంలో ప్రతి రోజూ ఒక సమరమే, ప్రతి అడుగు ఒక యుద్ధరంగమే. అలా జననం నుండే మొదలయ్యే ఈ సమరం మరణం వరకు కొనసాగించవలసిందే.. నిదురించే కనులకు తెలియదు తెలవారితే తెరచుకుంటాయో లేదో.. అడుగు వేసే పాదాలకు తెలియదు ఇదే చివరి అడుగు అవుతుందని..

ఇప్పుడు నేపాల్ లో నెలకొన్న పరిస్థితులే వీటికి అద్ధం పడుతున్నాయి.. హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా ఒదిగుకున్న అందమైన నేపాల్‌ను, ప్రకృతి వినాశకర రూపంలో క్షణాల్లో శ్మశానవాటికగా మార్చివేసింది. లంగ్-టాంగ్ జాతీయ పార్క్ ప్రాంతంలో మంచు పర్వత భాగాలు విరిగిపడటం, భోటె కోశి, త్రిశూలి నదుల ఉప్పెనలతో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు ఇక్కడి ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ప్రకృతి సృష్టించిన బీభత్సం వల్ల ప్రశాంతంగా పారే నదులు ఒక్కసారిగా కాలకూట విషమై ఉప్పొంగాయి.

ఎత్తైన పర్వతాల నుంచి విరుచుకుపడిన ప్రళయ జలాలు, మట్టి ప్రవాహాలు.. గ్రామాలు, వంతెనలు, భవనాలను సెకన్ల వ్యవధిలోనే మింగేశాయి. మానవ శ్రమతో నిర్మించిన నాగరికత అంతా ప్రకృతి ఆగ్రహ జ్వాలల్లో కొట్టుకుపోయింది. జీవితాలను చీకట్లోకి తోసేసిన ప్రళయం వందలాది ప్రాణాలను బలి తీసుకుంది.. శతకోటి కలలతో ఉన్న నిరుపేదలు, పర్యాటకులు వరద మట్టి ప్రవాహంలో సజీవ సమాధి అయ్యారు..

ఈ జలప్రళయంలో 700కి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. సహాయక చర్యలు కొనసాగేకొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.. అయితే గంటకు 169 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ మంచు, రాళ్ల వరద సృష్టించిన బీభత్సం వివరాలను శాస్త్రవేత్తలు తమ నివేదికలో వెల్లడించారు. వారి కథనం ప్రకారం, హిమాలయాల్లో ప్రకృతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది..

లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శ్రేణిలో సుమారు 16,700 అడుగుల ఎత్తు నుంచి ఓ భారీ మంచు శిఖరం విరిగిపడింది. దాదాపు 1.5 కిలోమీటర్ల వెడల్పున్న ఈ మంచు పర్వతం.. రాళ్లు, మట్టి సహా సమీప నదిలో కుప్పకూలడంతో ఏకంగా 300 అడుగుల ఎత్తున రాకాసి అల ఎగసిపడింది. మంచు, బురద, రాళ్లతో కూడిన ఈ భీకర ప్రవాహం గంటకు 169 కిలోమీటర్ల వేగంతో పర్వత లోయల గుండా దూసుకొచ్చింది.

దీని ధాటికి గిరాంగ్ పోర్ట్ ప్రాంతం క్షణాల్లోనే జలసమాధిగా మారిపోయింది. చూస్తుండగానే ఆ ప్రాంతం రూపురేఖలు చెరిగిపోయాయని శాస్త్రవేత్తలు వివరించారు. హిమాలయాల్లో పెరుగుతున్న వాతావరణ మార్పులే ఇలాంటి విపత్తులకు కారణమవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. వర్షం లేదు. గాలి వీచలేదు.. కానీ ఎన్నో సంవత్సరాల అభివృద్ధి ఒక్క క్షణంలో కనుమరుగై పోయిందని తెలిపారు..

#Nepal-floods#Sensational facts#revealed#scientists#report#Nepal disaster#169-kmph
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి