Panjaa Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ సినిమా పంజా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2)కి రీరిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా..ఇప్పటికే కోటిన్నర టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. ఇంకా, రిలీజ్ కి రెండు రోజుల సమయం ఉంది. అప్పటి వరకూ ఎన్ని లక్షల టికెట్స్ అమ్ముడవుతాయో చూడాలి.
డిసెంబర్ 9, 2011లో వచ్చిన పంజా:
మొదటిసారి పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన పంజా సినిమాను సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకాలపై నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతల, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కలిసి నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్, అంజలి లవానియా, జాకీ ష్రోఫ్, అడవి శేష్, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇక, ఈ సినిమాకి ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కొడుకు, ప్రముఖ తమిళ-తెలుగు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతమందించాడు. అప్పట్లో, ఈ సినిమా పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. మొదటిసారి పవన్ కళ్యాణ్ మేకోవర్ అందరికీ షాకింగ్‌గా అనిపించింది.
ఇక, ఈ సినిమా డిసెంబర్ 9 2011న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఖుషి..తమ్ముడు..తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్స్..ఆ సినిమాలలో పవన్ క్యారెక్టర్..మేకోవర్ చూసిన అభిమానులకి, ఆడియన్స్‌కి పంజా సినిమా ఎందుకనో కనెక్ట్ కాలేదు. పవన్ సీరియస్ రోల్ దెబ్బకొట్టింది. దాంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నమోదైంది.
OG ప్రభావమే:
కానీ, ఇప్పుడు ఇదే సినిమాను చూసేందుకు అభిమానులు, సినీ లవర్స్ తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ఉత్సాహం అడ్వాన్స్ బుకింగ్‌తోనే అర్థమవుతోంది. మరి, ఈ సినిమాకి ఏమేర వసూళ్ళు వస్తాయో చూడాలి. అప్పట్లో ఫ్లాపైన గ్యాంగ్ స్టర్ మూవీ ఇప్పుడింత క్రేజ్ రావడానికి బహుషా OG కారణం కావచ్చు. ఆ సినిమా ప్రభావమే పంజా రీరిలీజ్ విషయంలో ఆసక్తి కనిపిస్తుందని తెలుస్తోంది.










