National

Train : రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’

రచన: Kumar3 నిమిషాల పఠనం

రైలులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.ఒక్కసారిగా బోగిలోకి భారీగా పొగ రావడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దిగి పారిపోయారు.రైలులో అగ్నిప్రమాదం సంభవించిందని అంతా భావించినట్టు తెలిసింది.

రైలులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.ఒక్కసారిగా బోగిలోకి భారీగా పొగ రావడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దిగి పారిపోయారు.రైలులో అగ్నిప్రమాదం సంభవించిందని అంతా భావించినట్టు తెలిసింది. ప్యాసింజర్స్ ఒక్కసారిగా హాహాకారాలు చేయడంతో ఇతర కోచుల్లోని ప్రయాణికులు సైతం అప్రమత్తం అయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దిగేందుకు ప్రయత్నించారు. తీరా విషయం తెలిసే సరికి అంతా శాంతించారు.

వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలోని కర్జత్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న కోయినా ఎక్స్‌ప్రెస్ చక్రాల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వెలువడింది.దాంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు.కొద్దిసేపటి వరకు రైల్వే స్టేషన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. టెక్నికల్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి కొన్ని నిమిషాల్లోనే ఈ సమస్యను పరిష్కరించింది

రైలు చక్రాలకు ఉండే బ్రేకులు జామ్ అవ్వడం వల్లే పొగలు వెలువడ్డాయని అధికారులు క్లారిటీ ఇచ్చారు.తనిఖీలు చేపట్టిన అనంతరం రైలు ప్రయాణాన్ని కొనసాగించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బోగి మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో కిందకు దిగేందుకు దారి కానరాక ప్రయాణికులు ఇబ్బందిపడినట్టు తెలుస్తోంది. ప్రయాణికుల కేకలు స్ఫష్టంగా వినిపిస్తున్నాయి.

ఈ తతంగాని రైల్వే స్టేషన్‌లోని ఫుట్ బోర్డు‌పై నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు సమాచారం. రైల్వే ట్రాకుల మీద నుంచి దాటుకుంటూ ప్రాణభయంతో ప్రయాణికులు పరిగెడుతున్న దృశ్యాలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

https://x.com/pulsenewsbreak/status/2093963429635625466?s=20

#train wheels#breaks jam#smoke#maharastra#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి