సినిమా

Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో, అల్లు అర్జున్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట.

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో, అల్లు అర్జున్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట.

మూడు పాత్రల్లో మెగాస్టార్:

గతంలో మెగాస్టార్ చిరంజీవి మూడు విభిన్నమైన పాత్రల్లో ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఒకరు కూలీలకి యజమానిగా, ఒకరు పోలీస్ ఆఫీసర్‌గా ఒకరు బ్రాహ్మణుడిగా నటించి మూడు పాత్రలను అద్భుతంగా పండించాడు. ఇప్పుడు, అల్లు అర్జున్ కూడా ఇలా రాకా కోసం మూడు పాత్రల్లో నటిస్తున్నట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్ మూడు పాత్రల్లో..హీరోయిన్స్ నలుగురు:

అట్లీ ప్లాన్ ఏంటనేది మాత్రం రోజు రోజుకి అందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకముందెన్నడూ చూడని అల్లు అర్జున్‌ని రాకాలో చూపించడానికి అన్నీ రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. రాకా కోసం మూడు డిఫరెంట్ రోల్స్ డిజ్సైన్ చేశాడట. ఇక, హీరోయిన్‌గా నలుగురు కనిపించబోతున్నారు. ఇప్పటికే, దీపిక పడుకొన్ పాత్రకి సంబందించిన షూట్ కూడా పూర్తి కావచ్చిందంటున్నారు. ఇక, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారట. వీరిలో రష్మిక పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం.

రాకా షూటింగ్ మొత్తం ముంబైలోనే:

విదేశీ నిపుణులు పనిచేస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకి ముందు దుబాయ్ సహా ఇతర దేశాలలోనూ షూటింగ్ జరపడానికి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్లాన్ చేసింది. కానీ, ఇరాన్-ఇస్రాయెల్ యుద్ధం కారణంగా ఆ ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టి మొత్తం షూటింగ్ ముంబైలోని భారీ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుపుతున్నారు. మరోవైపు వీఎఫెక్స్ వర్క్ కూడా జరుగుతోంది. దీనికోసం పలు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

#allu arjun#atleekumar#deepika padukone#rashmika mandanna#megastar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి