Kayadu Lohar: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత సినిమాలోని కయాదు లోహర్ పాత్రపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా ఆమె పోషించిన సుబ్బు పాత్రలోని బోల్డ్, సజెసివ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో అసలు ఈ పాత్రను కయాదు ఎందుకు ఒప్పుకుంది? మొదట ఈ ప్రాజెక్ట్‌తో కీర్తి సురేష్ పేరు వినిపించిన నేపథ్యంలో.. ఆమె ఈ పాత్ర నుంచి తప్పుకోవడానికి ఇదే కారణమా? అనే చర్చ కూడా మొదలైంది.
అయితే, ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కీర్తి సురేష్ ఈ పాత్రను బోల్డ్ సీన్స్ కారణంగానే వదిలేసిందని అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. అంతేకాదు, మేకర్స్ కీర్తితో పాటు సుబ్బు పాత్రకి చాలామంది హీరోయిన్స్‌ను పరిశీలించారు. బడ్జెట్‌తో పాటు డేట్స్ సర్దుబాటు విషయాలను చూడాలి కాబట్టి ఈ రెండు విషయాలను నేరుగా లింక్ చేయడం సరైనది కాదు.
‘ది ప్యారడైజ్’లో కయాదు లోహర్ సుబ్బు పాత్రలో కనిపించింది. సినిమా విడుదలకు ముందు కూడా తన క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని, ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని కయాదు చెప్పింది. అంతేకాదు, తన పాత్రలో గ్రే షేడ్స్, రిస్కీ ఎలిమెంట్స్ ఉంటాయని ఆమె కూడా వెల్లడించింది. సినిమాలో సుబ్బు పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆమె గ్లామర్, బాడీ ఎక్స్‌పోజర్ చుట్టూ సాగుతాయి. ఒక రివ్యూ కూడా ఈ ఎపిసోడ్ కథకు ఎంతవరకు అవసరమో ప్రశ్నించింది.
ముఖ్యంగా, తల్లే నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బిడ్డా అని చెప్పడం..కూతురు బోల్డ్‌గా నటిస్తున్న సీన్స్ తల్లే దగ్గరుండి షూట్ చేయడంపై నెటిజన్స్ రక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చాడు. నీకు యాక్టింగ్ రాదు అని తిట్టిన తల్లే పొగడటం కరెక్టే అన్నాడు. కానీ, నేనే ఈ సీన్‌ని ఆడియన్స్‌కి సరిగ్గా కన్వే చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. కథలో, కయాదు పాత్ర పర్ఫెక్ట్‌గానే ఉంటుందని..ఆమె బాగా చేసిందని వెల్లడించాడు. కథ, అందులో పాత్ర నచ్చే కయాదు కూడా ఒప్పుకుంది. ఇప్పుడు, వస్తున్న రూమర్స్..కావాలని చేస్తున్నవే అని మేకర్స్ ఫీలవుతున్నారు. గతంలో వచ్చిన చాలా సినిమాలలో ఇంతకన్నా బోల్డ్ సీన్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు శ్రీకాంత్.


