Karthikeya: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు ఓవర్‌నైట్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకొని సంచలనంగా మారిన హీరో కార్తికేయ గుమ్మకొండ. అయితే, ఇది మొదటి సినిమాకే పరిమితం అయింది. ఆ తర్వాత కార్తికేయ హీరోగా ఏ సినిమా చేసినా కానీ ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్, తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై వంటి పెద్ద సినిమాల్లో విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
కానీ, హీరోగా మాత్రం కార్తికేయకి సరైన బ్రేక్ రాలేదు. బెదురులంక 2012, భజే వాయు వేగం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఎన్నో అంచనాలను పెట్టుకున్న ఈ సినిమాలు కూడా ఫ్లాప్‌గా మిగిలాయి. దీంతో, గత కొద్దికాలంగా కొత్త సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ హీరో నుంచి అప్‌డేట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు, నెటిజన్లు కార్తికేయ ఏమైపోయాడు? కొత్త సినినా కబురెప్పుడు చెప్తాడు..అని కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్స్ కి కార్తికేయ మంచి కౌంటర్ ఇచ్చాడు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త అవతారం ఎత్తి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పటికే, తెలుగులో విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, రామ్ పోతినేని వంటి యంగ్ హీరోలు..ఒకవైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగానూ, దర్శకుడిగానూ మారారు. ఈ క్రమంలో ఇంకొకరి కోసం ఎదురుచూడకుండా సొంత ప్రాజెక్ట్స్‌తో సక్సెస్‌లు కూడా అందుకుంటున్నారు. ఈ జాబితాలో హీరో కార్తికేయ కూడా చేరి మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా తన లక్ ని టెస్ట్ చేసుకోబోతున్నాడు.
కార్తికేయ, ఒక కొత్త తరహా కథను సిద్ధం చేసుకుని, స్వీయ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇన్నాళ్ళు సైలెంట్ గా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి, ఈవారం పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ద్వారా ఈ సినిమా రూపొందుతోంది. అతిత్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించనున్నాడు. అలాగే, షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కాస్త గ్యాప్ తర్వాత రీఎంట్రీకి ప్లాన్ చేసుకున్న కార్తికేయ, ఈసారి దర్శకుడిగానూ మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఆ ప్రయత్నాలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయో చూడాలి.












