సినిమా

MS-Subbulakshmi: కమల్ క్లాప్‌తో లెజండరీ బయోపిక్ ప్రారంభం

రచన: Anshu5 నిమిషాల పఠనం

MS-Subbulakshmi: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఓ బయోపిక్ మూవీలో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ బయోపిక్ ఎవరిదో కాదు..సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గారిది. ఆవిడ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సినిమాను భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాని ఘనంగా ప్రారంభించారు. ఇక, ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ కి ‘ఎం.ఎస్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటుగా ‘ఏ లెగసీ ఆన్‌ స్క్రీన్‌’ అనే ట్యాగ్ లైన్ ని కూడా పెట్టారు. ఇందులో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన నటిస్తుండటం విఏషం. ఈ చిత్రాన్ని చెన్నై వేదికగా ఘబంగాగా ప్రారంభించారు. సీనియర్ నటుడు కమల్‌ హాసన్‌ చేతుల మీదుగా ప్రారంభమవడం మరో విశేషం. ఇక, ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రష్మికపై కమల్ క్లాప్‌ కొట్టి, చిత్ర బృందానికి విశెష్ చెప్పారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'తన సంగీతంతో భారతదేశాన్ని, అలాగే సౌత్ ఇండియాని ఒకటి చేసిన సంగీత సామ్రాజ్ఞి అమ్మ ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఆవిడ సంస్కృతం, హిందీ సహా పలు భాషల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ ఇలా ఏ భాషలో ఆమె పాట పాడినా ఆ భాషకే అందం వచ్చేలా ఆ పాట ఉండేది.

ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. అమ్మ ఆలపించిన సుప్రభాతం, లలితసహస్రనామం, రంగపుర విహార పాటలు వింటే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మహాత్మాగాంధీ కూడా ఎంఎస్ సుబ్బులక్ష్మి అభిమాని అని తెలిపాడు కమల్. అంతేకాదు, ఆమె పాటలు విని ఆనందపడేవారు. ఇక, అమ్మ బయోపిక్ ని నిర్మిస్తున్న నిర్మాతలు అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్ లకు నా శుభాకాంక్షలు. మీ ప్రొడక్షన్స్ లో చేస్తున్న గొప్ప చిత్రమని అన్నారు.

అలాగే, అనిరుధ్ కూడా ఈ సినిమాతో మరో మెట్టు పైకి వెళతాడు. దర్శకుడు గౌతమ్ మీద చాలా బాధ్యత ఉంది. ఇక, అమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న రష్మిక మందన్నను చూస్తే నేను అసూయపడటం లేదు కానీ.. గడ్డం తీసేసినా కూడా నేను ఆమె పాత్రలో నటించి మెప్పించలేను.. ఈ టీమ్ అందరికీ నా బెస్ట్ విసెస్' అన్నారు. మొత్తానికి, ఈ లెజండరీ బయోపిక్‌లో నటించే అవకాశం అందుకున్న రష్మిక ఎంతో అదృష్టవంతురాలు అని అందరూ చెప్తున్నారు.

#MS-Subbulakshmi#Rashmika Mandanna#Kamal Hassan#Allu Aravind
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి