క్రీడలు

115 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్.. ఎంఎల్ఎస్ చరిత్రలోనే మెస్సీ ఆల్‌టైమ్ రికార్డు!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరీర్‌లో మరొక అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఇంటర్ మయామి క్లబ్ తరఫున తన 100వ గోల్‌ను నమోదు చేయడమే కాకుండా, జట్టుకు ప్రతిష్టాత్మకమైన కాంపియోన్స్ కప్ టైటిల్‌ను అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాత్రి జరిగిన తీవ్ర ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇంటర్ మయామి 2-0 తేడాతో మెక్సికన్ క్లబ్ క్రూజ్ అజుల్‌పై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

 ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరీర్‌లో మరొక అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఇంటర్ మయామి క్లబ్ తరఫున తన 100వ గోల్‌ను నమోదు చేయడమే కాకుండా, జట్టుకు ప్రతిష్టాత్మకమైన కాంపియోన్స్ కప్ టైటిల్‌ను అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాత్రి జరిగిన తీవ్ర ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇంటర్ మయామి 2-0 తేడాతో మెక్సికన్ క్లబ్ క్రూజ్ అజుల్‌పై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ కీలక విజయంలో మెస్సీ ఒక గోల్ చేయడంతో పాటు మరొక గోల్‌కు అసిస్ట్ అందించి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.

 ఆట ప్రారంభమైన 24వ నిమిషంలోనే మెస్సీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మైదానంలో సహచర ఆటగాడు లూయిస్ సువారెజ్ అందించిన క్రాస్‌ను మెస్సీ అత్యంత అద్భుతమైన డైవింగ్ హెడర్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపి అభిమానులను ఊపేసాడు. ఇది ఇంటర్ మయామి తరఫున మెస్సీకి 100వ గోల్ కావడం విశేషం. కేవలం 115 మ్యాచ్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా మేజర్ లీగ్ సాకర్ (MLS) చరిత్రలోనే ఒక క్లబ్ తరఫున అత్యంత వేగంగా 100 గోల్స్ పూర్తి చేసిన ఆటగాడిగా మెస్సీ రికార్డు పుటలకెక్కిడు. ఇప్పటివరకు మయామి తరఫున 100 గోల్స్, 55 అసిస్ట్‌లతో తన ప్రభావాన్ని చాటాడు.

 తదనంతరం మ్యాచ్ 81వ నిమిషంలో మెస్సీ అందించిన కార్నర్ కిక్‌ను కాసెమిరో హెడర్ ద్వారా గోల్‌గా మలిచి జట్టు ఆధిక్యాన్ని 2-0కి పెంచి విజయాన్ని ఖాయం చేశాడు. ఈ అద్భుత గెలుపుతో ఇంటర్ మయామి తన క్లబ్ చరిత్రలోనే తొలిసారి కాంపియోన్స్ కప్‌ను ముద్దాడింది. అమెరికా ఎంఎల్ఎస్‌ కప్ విజేత, మెక్సికో లీగా ఎమ్‌ఎక్స్ విజేత మధ్య ఏటా ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరు జరుగుతుంది. గత మూడు సీజన్లుగా మెక్సికన్ జట్లదే పైచేయి కాగా, ఈసారి మెస్సీ నాయకత్వంలోని మయామి వారి ఆధిపత్యానికి తెరదించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

 2023లో ఇంటర్ మయామిలో చేరిన మెస్సీ, తన తొలి గోల్‌ను కూడా ఇదే క్రూజ్ అజుల్ జట్టుపై నమోదు చేయడం ఒక విచిత్రమైన కాంబినేషన్. 39 ఏళ్ల వయసులోనూ తగ్గని ఫామ్‌తో దూసుకుపోతున్న మెస్సీ, ఇప్పటికే తన రాకతో జట్టుకు లీగ్స్ కప్, సపోర్టర్స్ షీల్డ్, ఎంఎల్ఎస్‌ కప్‌లను అందించాడు. తాజాగా సాధించిన కాంపియోన్స్ కప్‌తో ఇంటర్ మయామికి మరో ట్రోఫీని అందించాడు. నూతన హెడ్ కోచ్ క్రిస్టియన్ గొంజాలెజ్ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే ఈ టైటిల్ లభించడంతో మయామి యాజమాన్యం, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

#LionelMessi#InterMiami#CampeonesCup#Messi100Goals#MLS#FootballNews#SportsNewsTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి