తెలంగాణ

TG : తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం రేవంత్

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన సందర్భంగా నేడు ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన సందర్భంగా నేడు ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై త్రివర్ణ పతాకాన్నిఆవిష్కరించారు.దానికి ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నమస్కరించి అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు.

రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు

పబ్లిక్ గార్డెన్స్‌‌లో పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, అణచివేతపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరిస్తూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరి జాతీయ సగటు కంటే 91 శాతం అధికంగా ఉందన్నారు. రైతుల కోసం రూ.20,616 కోట్లతో రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో రూ.12,385 కోట్ల ఆదా చేశామన్నారు.

53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను సక్సెస్ ఫుల్‌గా అమలు చేశామన్నారు.సామాజిక న్యాయం దిశగా సమగ్ర కుల సర్వే పూర్తి చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని గుర్తుచేశారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, పారదర్శకంగా 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామన్నారు.

'తెలంగాణ రైజింగ్ విజన్ -2047' ద్వారా రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దేశంలోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా 30 వేల ఎకరాల్లో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నిర్మిస్తున్నామని చెప్పారు.ఇందులో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.చరిత్రను మరిచిపోకుండా, నాటి పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ రాష్ట్రాన్ని ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

#cm revanth reddy#prajapalana dinostavam#congress#september 17#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి