సినిమా

SrideviPropertyCase: శ్రీదేవి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

దివంగత హీరోయిన్ శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని కోట్లాది రూపాయల ఆస్తి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది. 1988లో శ్రీదేవి కొనుగోలు చేసిన 2.7ఎకరాల భూమిలో వాటా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కేవీ.విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

 దివంగత హీరోయిన్ శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని కోట్లాది రూపాయల ఆస్తి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది. 1988లో శ్రీదేవి కొనుగోలు చేసిన 2.7ఎకరాల భూమిలో వాటా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కేవీ.విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పద ఆస్తిపై యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశిస్తూ, శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు నోటీసులు జారీ చేసింది.

 అసలు వివాదం విషయానికి వస్తే, 1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని 4.77 ఎకరాల స్థలాన్ని ముదలియార్ కుటుంబం నుంచి శ్రీదేవి కొనుగోలు చేయగా, అది దశాబ్దాలుగా ఆమె ఆధీనంలోనే ఉంది. అయితే శ్రీదేవి మరణానంతరం 2023లో ఆస్తి మార్పిడి (మ్యుటేషన్) కోసం దరఖాస్తు చేయగా, ముదలియార్ రెండో భార్య పిల్లలైన ఎంసీ.శివగామి, ఆమె సోదరుడు తమకు కూడా ఆస్తిలో వాటా ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ దావాను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

 ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఈ ఆస్తి వివాదాన్ని ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఆస్తిని విక్రయించిన ఎంసీ. చంద్రశేఖరన్‌కు అందులో ఐదో వంతు వాటా ఉందా లేదా అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తొలి భార్య బతికుండగానే రెండో పెళ్లి జరిగిందన్న ప్రతివాదుల వాదనపై లోతుగా విచారించాల్సి ఉందని భావించిన ధర్మాసనం, వివాదాస్పద స్థలంలో తదుపరి చర్యలేవీ చేపట్టవద్దని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

 కపూర్ కుటుంబం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. 1988 నాటి భూమి అమ్మకం దస్తావేజులు చట్టబద్ధంగా జరిగాయని, దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి లావాదేవీని సవాలు చేస్తూ 2025లో దావా వేయడం కాలపరిమితి చట్టానికి (Limitation Act) విరుద్ధమని స్పష్టం చేశారు. పిటిషనర్లు 1990ల్లోనే వయోజనులు అయినప్పటికీ శ్రీదేవి మరణించే వరకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని వాదించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది.

#SrideviPropertyDispute#SupremeCourt#BoneyKapoor#JanhviKapoor#ChennaiRealEstate#SrideviNews#LegalNewsTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి