Jr.NTR: మన టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తూ సొంత నిర్మాణ సంస్థను స్థాపించి మంచి కథ దొరికినప్పుడల్లా సినిమాను నిర్మిస్తున్నాడు. అడవి శేష్ హీరోగా వచ్చిన మేజర్ ఈ బ్యానర్ నుంచి వచ్చిందే. ఇక, నేచురల్ స్టార్ నాని కూడా తన సొంత నిర్మాణ సంస్థలో తాను నటిస్తున్న సినిమాలతో పాటు బయట హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్నాడు.
కోర్ట్ లాంటి ప్రయోగాత్మక సినిమాని నాని నిర్మించాడు. అలాగే, హిట్ సిరీస్ ని నాని నిర్మిస్తున్నాడు. ఇక, ప్రస్తుత..మెగాస్టార్ చిరంజీవి హీరోగా శీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేశాడు నాని. భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కనుంది. ప్రభాస్ కూడా యూవీ క్రియేషన్స్ స్థాపించి స్నేహితులతో నడిపిస్తున్నాడు. నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' పేరు మీద బ్యానర్ ని స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే, తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం ఎన్టీఆర్ కూడా సొంతగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు, దీనికి ఓ వెరైటీ పేరును కూడా పెట్టినట్టు తెలుస్తోంది. తారక్ పేరునే ఎంటర్టైన్మెంట్ (NTRTAIN) ఎంటర్టైన్ గా ఈ బ్యానర్ కి పెట్టినట్టు సమాచారం. చూడాలి, మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే రానున్నాయని తెలుస్తోంది. నిర్మాతగా తారక్ నుంచి ఎలాంటి కంటెంట్ ఉండే సినిమాలు వస్తాయో.
కాగా, డ్రాగన్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ డివోషనల్ సినిమాను చేయబోతున్నాడు. సుబ్రమణ్య స్వామీ కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇప్పటికే, వచ్చిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. 2027 సెకండాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ నిన్నా మొన్నటి వరకూ ప్రచారంలో ఉండగా, తాజాగా దేవసేనాపతి అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని టాక్ మొదలైంది.


