తెలంగాణ

Harishrao Arrest: కోకాపేట్ నివాసంలో హరీశ్‌రావు ముందస్తు హౌస్ అరెస్ట్!

రచన: Swechaanews Chairman••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్(TIMS) ఆసుపత్రిని పరిశీలనకు సిద్ధమైన మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో ముందస్తు జాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆస్పత్రి వద్ద అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు యంత్రాంగం వెల్లడించింది.

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్(TIMS) ఆసుపత్రిని పరిశీలనకు సిద్ధమైన మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో ముందస్తు జాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆస్పత్రి వద్ద అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు యంత్రాంగం వెల్లడించింది.

హరీశ్ రావు పర్యటన పిలుపు నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే కోకాపేట్‌లోని ఆయన నివాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. హరీశ్ రావు ఇల్లు విడిచి బయటకు రాకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయన ఇంటికి వెళ్లే ప్రధాన రహదారులను కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకుని రాకపోకలపై ఆంక్షలు విధించారు.

ఈ ఆకస్మిక పరిణామంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హరీశ్ రావు హౌస్ అరెస్ట్ వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై ఆసుపత్రిని సందర్శిస్తే తప్పేంటని బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవల తీరును ఎండగట్టడానికే హరీశ్ రావు ఈ పర్యటన తలపెట్టారని, ఆ భయంతోనే ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నిర్బంధించిందని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. మరోవైపు, ముందస్తు అనుమతి లేకుండా ఆసుపత్రుల వద్ద నిరసనలు, పర్యటనలు చేపట్టడం వల్ల రోగులకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతోనే ముందస్తు అరెస్టు చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని, మందుల కొరత తీవ్రంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య సేవలు, ఆస్పత్రుల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎండగట్టేందుకు హరీశ్‌రావు సిద్ధమయ్యారు. అక్కడ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే ఆయన ఈ ఆస్పత్రి సందర్శన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు చర్చనీయాంశమైంది.

#Harish Rao House Arrest Kokapet#TIMS Sanathnagar Harish Rao Visit#BRS Harish Rao House Arrest News#Telangana Police House Arrest Harish Rao#Telangana BRS News#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి