Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే క్లాస్, మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకూ అందరూ చూసేలా ఉంటాయి. ఇప్పటికీ, తరగని అందం మహేష్ సొంతం. ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇండియాలో అందరి వయసు పెరుగుతుంటే మహేష్, సూర్య వయసు మాత్రం తగ్గుతుందని చమత్కాకారంగా అన్నారు.
సూర్య విషయం పక్కన పెడితే, మహేష్ ఏజ్ మాత్రం ప్రతీ సినిమాకి తగ్గుతుందనే భావన అందరికీ కలుగుతోంది. ఇక, ప్రస్తుతం, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతోంది వారణాసి. ఇందులో, హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించబోతోంది. వెర్సటైల్ యాక్టర్ పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
వారణాసి మూవీలో నో సాంగ్స్?
ఇప్పటి వరకూ ఈ మూడు పాత్రల లుక్స్, గ్లోబ్ ట్రాటర్ గ్లింప్స్ విపరీతమైన అంచనాలను పెంచాయి. అయితే, ఈ సినిమాలో సాంగ్స్ ఉండవని, థీమ్ మ్యూజిక్ మాత్రమే సినిమా మొత్తం రన్ అవుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, అది అసలు నిజం కాదట. తాజాగా, చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. దీంతో, మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
వారణాసి మూవీలో మొత్తం 6 పాటలు:
కీరవాణి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెప్టెంబర్ నెల నుంచి మొదలు పెట్టి, జనవరి వరకూ కంప్లీట్ చేస్తామని చెప్పాడు. అలాగే, ఇందులో మొత్తం 6 పాటలున్నాయని, వాటిలో 4 పాటలు ఇప్పటికే పూర్తయ్యాయి.. ఇంకో 2 పాటలను కంపోజ్ చేయాల్సి ఉందని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి, వారణాసి సినిమా సాంగ్ కి సంబందించి వచ్చిన రూమర్స్ కి కీరవాణి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక, ఈ సినిమాను 120 దేశాలలో మొత్తం 20 భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఎ.ఎస్.రాజమౌళి.


