క్రైమ్

వీడిన ప్రిన్సిపాల్ మర్డర్ మిస్టరీ.. 27సార్లు పొడిచి చంపిన పదో తరగతి విద్యార్థులు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. జేబీ కాలనీలోని ఆమె నివాసంలో ఈనెల 11వ తేదీ రాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని పాఠశాల విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. జేబీ కాలనీలోని ఆమె నివాసంలో ఈనెల 11వ తేదీ రాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని పాఠశాల విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలిని ఏకంగా 27సార్లు కత్తితో పొడిచి అత్యంత ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దాదాపు 80మందిని సుదీర్ఘంగా విచారించిన అనంతరం సంచలన విషయాలను గుర్తించారు. కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఇబ్రహీంపట్నం సమీపంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లొంగిపోయిన నిందితుల్లో ఇద్దరు బాధితురాలు పనిచేస్తున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

కేసులో అత్యంత భయానకమైన విషయమేమిటంటే.. దారుణ హత్యకు పాల్పడిన తర్వాత కూడా ఆ విద్యార్థులు ఏమీ తెలియనట్లు రోజూ యథావిధిగా బడికి వచ్చారు. పాఠశాలలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల కదలికలు, విచారణ తీరును నిశితంగా గమనిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం రూపారెడ్డి నివాసం నుంచి నిందితులు రూ.4 లక్షల నగదును దొంగిలించినట్లు సమాచారం ఆధారంగా భావిస్తున్నారు.

కేవలం నగదు దోపిడీ కోసమే ప్రిన్సిపాల్‌ను హత్య చేశారా? లేక దీని వెనుక ఏదైనా పగ, విద్వేషం లేదా ఇతర బలమైన కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మైనర్ విద్యార్థులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం విద్యా రంగంలోనూ, సమాజంలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే, పోలీసులు త్వరలోనే ఈ కేసు పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మారింది.

#Nalgonda School Principal Murder Case#Kondamallepally Principal Murder Tenth Students#Nalgonda Principal Murder 27 Stabs#Telangana School Principal Murder Investigation#Telangana Crime News#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి