సినిమా

Jana Nayagan: సీఎం విజయ్ కి ఫ్లాప్ తప్పలేదా?

రచన: Anshu3 నిమిషాల పఠనం

Jana Nayagan: తమిళ నాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ కి తాజాగా నటించిన జన నాయగన్ సినిమాతో ఫ్లాప్ తప్పేలా లేదని కోలీవుడ్ మీడియా వర్గాలలో బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణం ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ ఆకట్టుకోలేకపోవడమే. దర్శకుడు హెచ్.వినోథ్ ఎంత కాదన్నా, ఇది భగవంత్ కేసరి సినిమా కథ కాపీనే.

Jana Nayagan: తమిళ నాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ కి తాజాగా నటించిన జన నాయగన్ సినిమాతో ఫ్లాప్ తప్పేలా లేదని కోలీవుడ్ మీడియా వర్గాలలో బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణం ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ ఆకట్టుకోలేకపోవడమే. దర్శకుడు హెచ్.వినోథ్ ఎంత కాదన్నా, ఇది భగవంత్ కేసరి సినిమా కథ కాపీనే.

టీజర్ చూసినప్పటి నుంచే, జన నాయగన్ సినిమా నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి అని పలు సోషల్ మీడియా మాధ్యమాలలో, మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ట్రైలర్ వచ్చాక అది కన్‌ఫర్మ్ అయింది. అయినా, వినోథ్ మాత్రం పూర్తిగా దీనికి ఒప్పుకోలేదు. కట్ చేస్తే, ఈ నెల 23వ తేదీన జన నాయగన్ థియేటర్స్‌లోకి వచ్చింది.

సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడేవరకూ కూడా బాలయ్య సినిమానే గుర్తు చేస్తోంది. కథ మొత్తం మక్కీకి మక్కీ దింపేశాడు. అయితే, తెలుగులో ఉన్నంత ఎమోషనల్ సీన్స్ మాత్రం జన నాయగన్ లో లేవు. సినిమా ఫ్లాప్ అనడానికి కూడా ఇదే కారణం. విలన్ గా నటించిన బాబీ డియోల్ అద్భుతంగా నటించాడు. ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియమణి పాత్రలు ఆకట్టుకున్నాయి.

తెలుగులో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రను తమిళంలో పూజా హెగ్డే చేసింది. అలాగే, శ్రీలీల పాత్రను (విజ్జి) మిమిత బైజు చేసింది. మొత్తానికి, సీఎం అయిన తర్వాత వచ్చిన జన నాయగన్ విజయ్ కి నిరాశనే మిగిల్చేలా ఉంది. అసలే, పలుమార్లు వాయిదా పడి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. ఇప్పుడు, ఈ టాక్‌తో సినిమాను చూడాలన్నా, ఆసక్తి కలగడం కష్టమే. పైగా దేశమంతా చూసేసిన (భగవంత్ కేసరి) కాబట్టి..విజయ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది అంతే.

#cmvijay#thalapathyvijay#jananayagan#poojahegde
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి