Sai Pallavi: కొన్ని కాంబినేషన్‌ల మీద అటు సినీ వర్గాలలో, ఇటు అభిమానుల్లో, సినీ లవర్స్‌లో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. గతంలో, ఎక్కువగా హీరో-దర్శకుడి కాంబోకి మంచి క్రేజ్ ఉండేది..బిజినెస్ కూడా ఇది చూసే జరిగేది. ఆ తర్వాత, లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తీసుకువచ్చారు. వీటికి మంచి క్రేజ్ వచ్చింది.
స్టార్ హీరోయిన్స్‌తో టాలెంటెడ్ డైరెక్టర్స్ గనక సినిమాను ప్రకటిస్తే, అప్పటి నుంచే అందరిలో ఓ బజ్ క్రియేట్ అవుతుంది. అరుంధతి సినిమాతో అనుష్క శెట్టికి టాలీవుడ్ లో ఎలాంటి పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ మూవీని అనుష్కతో ప్లాన్ చేసిన ఏ డైరెక్టర్ అయినా, బాగానే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు.
ఇప్పుడు, ఇలాంటి ఓ రేర్ కాంబినేషన్ సెట్ కాబోతుందని తాజాగా ఓ వార్త అటు ఫిల్మ్ సర్కిల్స్ లో ఇటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ రేర్ కాంబినేషనే ఫిదా బ్యూటీ సాయి పల్లవి, ఫ్యామిలీ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల. వీరి కాంబోలో సినిమాను ప్రకటిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం, సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయాణ సిరీస్ లో సీతగా నటిస్తోంది. ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ ఏక్ దిన్ ఫ్లాప్‌గా మిగిలింది. ఇది హిందీలో సాయి పల్లవి డెబ్యూ. మళ్ళీ, ఇప్పుడు తెలుగులో కిషోర్ తిరుమల చెప్పిన కథ నచ్చి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉందట. మైథలాజికల్ కథాంశంతో ఇప్పటికే, కిషోర్.. సాయి పల్లవికి స్టోరీ నరేట్ చేసినట్టు సమాచారం. మరి, ఈ కాంబినేషన్ కి సంబందించిన ప్రాజెక్ట్ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.












