Spirituality

Spirituality: ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఎలా?..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే.. కేవలం పూజలు చేయడం, మంత్రాలు జపించడం లేదా గ్రంథాలు చదవడం మాత్రమే సరిపోతుందా? ఈ విషయంలో శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే.. కేవలం పూజలు చేయడం, మంత్రాలు జపించడం లేదా గ్రంథాలు చదవడం మాత్రమే సరిపోతుందా? ఈ విషయంలో శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.. నిజానికి.. ఆధ్యాత్మికత అంటే సమాజాన్ని వదిలి అడవులకు వెళ్లడం కాదు.. మనలోని అహంకారాన్ని, కోపాన్ని, అసూయను, భయాన్ని జయించడం.

మనిషి బయట ప్రపంచాన్ని గెలవడానికి జీవితాంతం ప్రయత్నిస్తాడు. కానీ.. తన మనసును గెలవడానికి మాత్రం చాలా తక్కువ సమయం కేటాయిస్తాడు. నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యేది.. మనిషి తనలోకి తాను చూసుకోవడం ప్రారంభించినప్పుడే అనే విషయం గుర్తించడు.

అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారు ఏమంటారంటే?.. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. ధ్యానం అంటే ఆలోచనలు పూర్తిగా ఆగిపోవడం కాదు.. ఆలోచనలను గమనిస్తూ.. వాటికి బానిస కాకుండా ఉండటం. మనసును గమనించే కొద్దీ.. మనలోని నిజమైన 'నేను' ఎవరో అర్థమవుతుంది.

అలాగే.. సత్యం, దయ, నిజాయితీ, నిస్వార్థం వంటి సద్గుణాలు ఆధ్యాత్మిక సాధనకు పునాది. దేవుడిని వెతుకుతూ దేవాలయాలకు వెళ్లే ముందు.. మన ప్రవర్తనలో దైవత్వం ఉందా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని తెలుపుతున్నారు.

అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనలో సత్సంగం కూడా ఎంతో ముఖ్యమైనదని అంటున్నారు.. మనం ఎవరితో ఉంటామో.. వారి ఆలోచనలు మనపై ప్రభావం చూపుతాయి. జ్ఞానుల సాంగత్యం మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది.. మరోవైపు భగవద్గీత, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. కానీ.. చదివిన జ్ఞానం మన ప్రవర్తనలో కనిపించినప్పుడే అది నిజమైన జ్ఞానంగా మారుతుంది.

ఇక ఆధ్యాత్మిక సాధనలో అత్యంత కఠినమైన సాధన.. అహంకారాన్ని తగ్గించుకోవడం. 'నేనే చేశాను' అనే భావన తగ్గి.. నా ద్వారా భగవంతుడి కృప వల్ల ఈ పని జరిగింది అనే భావన పెరిగినప్పుడు.. మనసు తేలికవుతుంది.. ఆధ్యాత్మిక ఉన్నత స్థానం అంటే అద్భుత శక్తులు పొందడం కాదు.. మనసులో శాంతి కలగడం. పరిస్థితులు మారకపోయినా.. వాటిని చూసే దృష్టి మారడం..

విజయం అంటే ప్రపంచం మనల్ని గుర్తించడం కాదు.. మనలోని నిజమైన మనిషిని మనమే గుర్తించడం. ఇవన్నీ అలవడాలంటే ఓపిక, సత్యమైన ఆలోచన, నడవడిక, నిస్వార్థ గుణం మనసుకు అలవాటు చేయాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.. ఎందుకంటే.. దేవుడిని చేరుకోవడానికి దూరంగా ప్రయాణించాల్సిన అవసరం లేదు.. మనసును శుద్ధి చేసుకున్న క్షణంలో.. దైవత్వం మనలోనే మేల్కొంటుంది..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..

#Indian#Spirituality#Meditation#Spiritual Practice#Temples
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి