అంతర్జాతీయం

US: ట్రంప్‌నకు ‘ఇండియన్ అమెరికన్ల’ బిగ్ షాక్.. డెమోక్రాట్ల వైపే ఏకపక్ష మొగ్గు!

4 నిమిషాల పఠనం

US: అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్‌నకు భారత సంతతి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. యూఎస్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఇండియన్ అమెరికన్లు ఈసారి స్పష్టంగా డెమోక్రాట్ల వైపే నిలబడినట్లు తాజా లెక్కలు తేల్చాయి. ఎన్నికల వేళ యూగవ్‌తో కలిసి ప్రతిష్టాత్మక కార్నెగీ సంస్థ నిర్వహించిన ‘ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే’లో వెల్లడైన సంచలన విషయాలు ట్రంప్ శిబిరానికి మింగుడుపడటం లేదు.

రిపబ్లికన్లకు 19 శాతమే.. డెమోక్రాట్లకు భారీ ఆధిక్యం!

సర్వే వివరాల ప్రకారం.. భారతీయ అమెరికన్లలో ఏకంగా 62 శాతం మంది తమ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టేందుకు మొగ్గు చూపారు. ట్రంప్‌నకు, రిపబ్లికన్లకు మద్దతుగా నిలిచింది కేవలం 19 శాతం మంది మాత్రమే. 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో 30 శాతం మంది భారత సంతతి ప్రజలు రిపబ్లికన్లకు అండగా నిలవగా.. తాజా పరిస్థితుల్లో ఆ మద్దతు ఒక్కసారిగా 19 శాతానికి పడిపోవడం ట్రంప్ విధానాలకు భారత సంతతి చెంపపెట్టులాంటి పరిణామంగా మారింది.

వలస విధానాలపై భగ్గు..

ట్రంప్ దూకుడు నిర్ణయాలు, వివాదాస్పద వలస విధానాలే ఈ తీవ్ర మార్పునకు కారణమని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆయన నడిపించిన తీరు, అలాగే అమెరికా-భారత్ సంబంధాల విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలపై భారతీయ అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. వయస్సుల వారీగా చూస్తే.. ట్రంప్ పార్టీకి మరింత నిరాశ తప్పలేదు. 40 ఏళ్లు పైబడిన పురుషుల్లో రిపబ్లికన్లకు మద్దతిచ్చే వారి సంఖ్య ఏకంగా 16 శాతానికి పడిపోయింది. 18-39 ఏళ్ల యువ ఓటర్లలో 2024 ఎన్నికల్లో 40 శాతం మంది ట్రంప్‌ను సమర్థించగా, ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం 23 శాతానికి దిగజారింది. మహిళా ఓటర్లు ట్రంప్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున డెమోక్రాట్ల వైపు మళ్లారు. మొత్తంగా చూస్తే.. కీలక సమయంలో భారత సంతతి ఓటర్లు ట్రంప్‌నకు మూకుమ్మడిగా మొహం చాటేసి, డెమోక్రాట్లకే గట్టిగా జైకొట్టడం యూఎస్ ఎన్నికల ఫలితాల్లో పెద్ద మలుపుగా మారింది.

#Indian Americans#Donald Trump#US Midterm Elections#Democrats#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి