దంపతులు గొడవ పడిన ఘటనలో భర్త భార్య ముక్కు కొరికాడని ఓ వార్త వైరల్ అయ్యింది.అయితే, దానివెనుక పెద్ద స్టోరీ ఉందని తాజాగా వెలుగుచూసింది. భార్య భర్తల మధ్య గొడవకు మనస్పర్దలు కారణం కావని..భార్య వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. భర్తను కాదని ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో వెళ్లిన భార్య.. మరల పిల్లల కోసం దొంగతనంగా ఇంట్లోకి చొరబడటంతో ఇద్దరి మధ్య తగవులాట చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే భర్త.. భార్య ముక్కు కొరికినట్టు తెలుస్తుండగా.. బాధితురాలు మాత్రం మరో విధంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది.
పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయి జిల్లా కేంద్రంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకివెళితే.. సాధన(27), దీపక్ భార్యాభర్తలు..వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపక్ ఫ్రెండ్‌తో సాధన వివాహేతర సంబంధం పెట్టుకొని, రెండున్నర నెలల క్రితం అతనితో వెళ్లిపోయింది.
సెప్టెంబర్ 17న తన పిల్లల్ని తీసుకెళ్లడం కోసం దొంగచాటుగా పొరుగింటి పైకప్పు మీదుగా ఇంట్లోకి చొరబడినట్టు తెలిసింది. ఆ సమయంలో భర్త దీపక్ ఇంట్లోనే ఉండటంతో తన పరువు తీసిందనే కోపంతో ఆమె మీద దాడి చేసినట్టు సమాచారం.అయితే, తన ముక్కు కొరికేసి దానిని కాలువలో పడేశాడని సాధన ఆరోపించింది.తనపై భర్త దాడి చేసిన సమయంలో అత్తమామలు తన చేతులు గట్టిగా పట్టుకున్నారని కూడా పోలీసులకు చెప్పింది.
ఇదిలాఉండగా, సాధననే గొడవ పడి, దీపక్ ప్రైవేట్ పార్ట్స్ కొరికేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.పిల్లల్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించిన సాధనను అడ్డుకోబోతే ఈ దారుణానికి ఒడిగట్టిందని వాళ్లు పేర్కొన్నారు. ఈ గొడవలో సాధన తీవ్రంగా గాయపడటంతో.. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఇద్దరిని విచారించిన అనంతరం దీపక్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ముక్కు, తలకు గాయం కావడంతో సాధన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజువల్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.











