తెలంగాణ

KTR : హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు..

రచన: Kumar3 నిమిషాల పఠనం

శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బీజేపీ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న రైతు భరోసా సభ వేదికగా ఆరోపించిన విషయం తెలిసిందే.

శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బీజేపీ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న రైతు భరోసా సభ వేదికగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని సైతం పరోక్షంగా విమర్శించారు. అలా చేయడం లేదని భద్రాద్రి రాముడి మీద ఒట్టేసి చెప్పాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి.. హరీశ్ రావుకు సవాల్ విసిరారు. కాగా, నిన్న రాత్రే హరీశ్ రావు సైతం కౌంటర్ ఇచ్చారు. ‘మాట మార్చడం, పార్టీలు మారే సంస్కృతి నీది’ అంటూ హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తాజాగా తెలంగాణ భవన్‌లో సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు.‘హరీశ్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు. కేసీఆర్ గారికి పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండి రక్షణ కవచంగా నిలిచిన వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావు మీద వచ్చిన పుకార్లను కొన్ని వందల సార్లు తిప్పి కొట్టాడు.నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్.. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు పార్టీలో మారిండు, ఆయన మాట్లాడితే ఎట్లా అని హరీష్ రావు ఎన్నోసార్లు చెప్పిండు.రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడు.. రాత్రికి బీజేపీ వాళ్ళతో ఉంటాడు. శీల పరీక్ష చేయాలంటే ముందు రేవంత్ రెడ్డికి చేయాలి’ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

https://x.com/TeluguScribe/status/2075859385411408361?s=20

#KTR#Harishrao#cm revanthreddy#telangana#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి