సిటీలో ప్రతి అనుమతుల్లో 70 శాతం ఫేక్?
ప్రతి విద్యా సంస్థలో బ్రోకర్లదే పైచేయి?
యాజమాన్యాలకు కావాల్సిన అన్ని రకాల అనుమతుల సర్టిఫికెట్స్ ఇప్పించేది వీళ్లే?
ఏ ఒక్క నిబంధన పాటించకపోయినా అధికారిక క్లియరెన్స్?
ఎడ్యుకేషన్ లో డీఈవోలను సైతం మోసం
ప్రతి డిపార్ట్ మెంట్ లో నకిలీ పత్రాలే
వ్యవస్థను మార్చేందుకు వచ్చిన హైడ్రాతో బట్టబయలు అవుతున్న ఫేక్ బాగోతాలపై స్వేచ్ఛ ఛైర్మన్ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
స్వేచ్ఛ ఛైర్మన్, 9848070809
ఫేక్ సర్టిఫికెట్స్ గుర్తించడానికి దశబ్దాల కాలం
జీహెచ్ఎంసీ పరిధిలో ఏ షాపుకైనా ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి. 5 అంతస్థుల కంటే ఎక్కువ ఉంటే ఫైర్ డిపార్ట్ మెంట్ అన్నీ పర్యవేక్షించి ఎన్వోసీ ఇవ్వాలి. అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న రెసిడెన్షియల్ కాకుండా ఎలాంటి కమర్షియల్ అయినా జీహెచ్ఎంసీ పరిధిలోని హైడ్రా అధికారుల అనుమతులు తప్పకుండా ఉండాల్సిందే. హైడ్రా కంటే ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అంటూ ఉండేది. ఇలా ఒక్క స్కూల్స్ మాత్రమే కాదు, కమర్షియల్ కరెంట్ మీటర్ ఉన్న ప్రతి బిల్డింగ్ కు హైడ్రా లాంటి సంస్థలతో ఫైర్ అనుమతులు ఉండాల్సిందే. కానీ బేగం బజార్, సుల్తాన్ బజార్, కోఠి నుంచి మొదలుకొంటే రింగ్ రోడ్డు పరిధిలో చాలా కమర్షియల్ బిల్డింగ్స్ కు అనుమతులు ఉండవు. ఒకవేళ కార్పొరేట్ సంస్థలకు కావల్సి వస్తే ఫేక్ సర్టిఫికేట్ తో కింది స్థాయి ఉద్యోగులు వేలల్లో లంచాలు తీసుకుని ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాడుతున్నాయి. వాళ్ల డీవియేషన్స్ కు రావని తెలుసుకుని అధికారికంగా ఇవ్వలేమని చెప్పి ఇస్తున్న అధికారులు ఉన్నారు.
రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చాకనే తెలిసింది?
ఇటీవల ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి సేఫ్టీపై కొందరిని హైడ్రాలోకి తీసుకున్నారు. అయితే ప్రతి కింది స్థాయి ఉద్యోగితో పాటు పైస్థాయి వరకు ఈ ఇల్లీగల్ , ఫేక్ సర్టిఫికెట్స్ కోసం డబ్బులు ముడుతూ ఉంటాయి. మాముళ్లలో తేడా రావడంతో ఓ స్టేషన్ ఫైరింగ్ ఆఫీసర్ ప్రశ్నించారు. అంతా హైడ్రా వాళ్లే చూస్తున్నారని చెప్పడంతో ఆ అక్కసు అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ పై పడింది. ఓ డీఈవో కూడా ఈ విషయాన్ని గమనించారు. సాధారణంగా ఫైర్ తో పాటు, పొల్యూషన్, ట్రాఫిక్ క్లియరెన్స్, లోకల్ అబ్జెక్షన్, ఎమ్ఈవో, ఫ్యాకల్టీ సర్వీస్ అంటూ 10 రకాల అనుమతులు అవసరం ఉంటాయి. ఓ స్కూల్ యజమాన్యం అన్నీ ఉన్నాయని సమర్పించింది. ఇలా అన్ని స్కూల్స్ ఇవ్వడంతో ఒక్కే నెంబర్ ఉన్నాయని తెలుసుకుని ఫీల్డ్ వెరిఫికేషన్ కు వెళ్లారు. అక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. పైగా అన్ని అనుమతులు ఫేక్ అని తెలుసుకుని మొదటగా హైడ్రా, ఫైర్ డిపార్ట్ మెంట్ కు లేఖ రాశారు. దీంతో ఇవ్వన్నీ తాము ఇవ్వలేదని తెలిపారు. హైడ్రా చీఫ్ రంగనాధ్ దృష్టికి వెళ్లడంతో ఏంటీ ఈ ఫేక్ అంటూ మండిపడ్డారు.
రంగనాథ్ మార్క్.. వీటిపైనా ఉంటుందా?
చెరువులను కాపాడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ఫైట్ చేస్తున్నారు. కానీ కొన్నింట్లో అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. వీటికి తోడుగా కేసులు. అయితే ఈ బ్రోకర్ల స్కాంకు చెక్ పెడుతారా? లేదా కార్పొరేట్ స్థాయి పైనే దృష్టి పెట్టి వదిలేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈయన నిర్ణయాలు కింది స్థాయి అధికారులకు వరంగా మారుతున్నాయి. వీళ్లను కూడా కంట్రోల్ లో పెడుతారా లేదా అనేది కూడా ఓపికగా ప్రజలు చూస్తునారు. హైడ్రా కూడా అన్ని సంస్థల్లో ఒకటే అనే విధంగా ఉండొద్దని లంచాలు తీసుకుంటున్న వారిపై చూసీ చూడనట్లు వదిలేయొద్దని సూచిస్తున్నారు.












