తెలంగాణ

BRS : ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావు

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని,ఆపై అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.ఈ మేరకు మంగళవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని,ఆపై అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.ఈ మేరకు మంగళవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభలోకి రానివ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పోలీసులు క్రూరంగా వ్యవహారించారని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించార్నారు. ఆ పోలీసులే నేడు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లు తాత మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. హైకోర్టు చెప్పినా వినకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయడమంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు.

ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి ఎందుకింత కక్ష, రేవంత్ రెడ్డి గారూ? BRS ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి రాకుండా చేసి, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా? అని ప్రశ్నించారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22A భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే ఈ అరెస్టులు చేస్తున్నారా? అని అడిగారు. ‘మా మహిళా శాసనసభ్యుల చీరలు లాగారు. గొంతు పిసికారు. ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఉల్టా మాపైనే కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా?’ అని మండిపడ్డారు.

‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఎందుకు పోలీసులను పెట్టారు? ఎందుకు మా ఇళ్ళను చుట్టు ముట్టారు? పోలీసులను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నావు. ఇది ప్రజాపాలన కాదు. ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యం. ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం. రేవంత్ రెడ్డీ.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా BRS గొంతుకను అణచలేరు. ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కడుగుతాం’ అని హరీష్ రావు రాసుకొచ్చారు.

https://x.com/BRSHarish/status/2097155966240260307?s=20

#harish rao#brs#assembly sessions#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి