Bigg Boss 10 Telugu: హిందీ, తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలలోనూ అతిపెద్ద రియాలిటీ షోగా పాపులరయిన బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో మొదలు కాబోతోంది. ఇటీవల దీనికి సంబందించిన ప్రోమో వచ్చి బాగా ఆకట్టుకుంది. ఈసారి ఏదైనా పదింతలు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని నాగార్జున ప్రామిస్ చేశాడు. దీనికి, కారణం ఇప్పటి వరకు 9 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలో సీజన్ 10 మొదలవబోతుండటమే.
ఈరోజు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టార్ మా బృందం ప్రోమోను వదిలారు. అలాగే, ఈ షో ఎప్పటి నుంచి మొదలబోతుందో కన్‌ఫర్మ్ చేశారు. ఈ సెప్టెంబర్ 6,7 తేదీలలో బిగ్ బాస్ 10 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తో గ్రాండ్ గా మొదలు పెట్టనున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్ 10 కి హోస్ట్ మారబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో ఎలాంటి మార్పూ లేదని మరోసారి నాగ్ బర్త్ డే సందర్భంగా కన్‌ఫర్మ్ చేశారు.
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ బిగ్ బాస్:
బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రతీ భాషలో కాంట్రవర్సీనే ఎదుర్కుంటోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు. తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ లాంటి పాపులర్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ సీజన్స్ కి హోస్టులుగా వ్యవహరించారు. భాష ఏదైనా ఇందులో పెట్టే టాస్క్‌లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్ హౌజ్ బ్రోతల్ హౌజ్:
తెలుగు రియాలిటీ షోపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకదశలో ఈ షోపై కోర్టులో కేసు కూడా వేశారు. ఇలాంటి చెత్త షో వల్ల యువత చెడిపోతుందని, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ఆయన నిలదీశారు. ఇదొక బ్రోతల్ హౌజ్ అని కూడా CPI నారాయణ కామెంట్స్ చేశారు. అయినా, ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షోపై ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. మరి, ఈసారి సీజన్ 10 ఎంత రసవత్తరంగా ఉండబోతుందో చూడాలి.












