సినిమా

Nayanthara: నయన్‌కేమైంది అన్నీ ఫ్లాప్ సినిమాలనే ఎంచుకుంటోంది?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Nayanthara: ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ నయనతార. ఎంత సీనియారిటీ ఉన్నా కొన్నిసార్లు ఎంచుకున్న కథలు కలిసి రాక ఫ్లాప్స్ చూడాల్సి వస్తుంది. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నయన్, ఇప్పుడు వచ్చిన రెండు సినిమాలతో ఫ్లాప్స్ చూసింది. ఆ సినిమాలే టాక్సిక్, హాయ్. వీటిలో ఒకటి పాన్ ఇండియన్ సినిమా..ఇంకోటి తమిళ సినిమా. దీంతో నయన్‌కేమైంది అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో టాలీవుడ్‌లో కనిపించి సాలీడ్ హిట్ అందుకొని కంబ్యాక్ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ నయనతార. చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొంది. దీంతో, వెంటనే తెలుగులో నందమూరి బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకొనే ఛాన్స్ అందుకుంది.

ఇక, ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం సైన్ చేసిన సినిమా టాక్సిక్. ఈ సినిమా ఒప్పుకోవడమే ఆమె చేసిన బిగ్ మిస్టేక్ అని అంటున్నారు. కారణం..ఇంతమంది ఉన్న హీరోయిన్స్‌లో నయన్ కి స్క్రీన్ స్పేస్ ఏముంటింది..? ఇంకో ముఖ్య విషయం..ఎవరైనా యష్ పక్కన హీరోయిన్‌గా నటించాలనుకుంటారు గానీ, సోదరి పాత్రను అస్సలు ఒప్పుకోరు. పైగా, టాక్సిక్‌లో నయన్‌ది ఎంతమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర. ఇది ఒప్పుకొని పెద్ద పొరపరపాటే చేసింది.

ఇక, తాజాగా నయనతార 'హాయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరమ రొటీన్ కథ-కథనాలతో తెరకెక్కిన సినిమా. పైగా, ఈ సినిమాకి నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ నిర్మాతలు. అయినా, కూడా ఇలాంటి రొటీన్ కథను ఎలా ఎంచుకున్నారనేది అర్థం కానిది. ఇలా, ఒకే వారంలో ఈ లేడీ సూపర్ స్టార్ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ టాక్‌ని మూటగట్టుకున్నాయి. నయన్‌కి ఫ్లాపులు కొత్తేమి కాదు. కానీ, ఇలాంటి సమయంలో రిస్క్ అవసరమా?

#nayanthara#toxic#hai#yash#geethu mohandas
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి